Read News in Telugu Language
adsdaksha

యువ సేవాసమితి ఔదార్యం.. అనాధ వృద్ధురాలకి నెలకు సరిపడా సరుకులు పంపిణీ ..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఏప్రిల్ 18

సాయి వెంకట్ మొగుదుంపురం : నెట్ వర్క్ ఇంచార్జ్, దక్ష న్యూస్

యువ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం సత్తుపల్లి పట్టణానికి చెందిన అనాధ వృద్ధురాలికి గాయత్రి పెయింట్స్ ( gayatri paints ) నిర్వాహకులు శివ ఆర్థిక సహాయంతో నెలకు సరిపడా నిత్యవసర సరుకులు, వారానికి సరిపడా కూరగాయలు, 25కేజీల బియ్యం, పరుపు, పాదరక్షలు, దుస్తులు పంపిణీ చేశారు. సత్తుపల్లి ( sattupalli ) మున్సిపల్ చైర్మన్ కుసంపూడి మహేష్ ( kusampudi mahesh ) చేతుల మీదుగా నిర్వాహకులు వృద్ధురాలికి సాయం అందించి తమ ఔదార్యం చాటుకున్నారు.

read also : hayabusa bike : అందుబాటులో కొత్త సుజుకి హయబుసా బైక్.. యానివర్శరీ సెలబ్రేషన్ ఎడిషన్ మోడల్ చూస్తే వావ్ అనాల్సిందే..

Hospital

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కుసంపూడి మహేష్ మాట్లాడుతూ యువసేవ సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది పెద్దల ప్రశంసలు పొందారని అన్నారు. యువ సేవా సమితి సభ్యులకు ఎల్లప్పుడూ తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. సమితి సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు.

read also : ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా.. జూలై 24న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం..

ఈ కార్యక్రమంలో యువ సేవాసమితి వ్యవస్థాపకులు జొన్నలగడ్డ రాజు, కిష్టారం యువ సేవా సమితి అధ్యక్షుడు తీగవరపు కేశవరెడ్డి, కిష్టారం యువసేవ సమితి ప్రధాన కార్యదర్శి ఉబ్బన దుర్గాప్రసాద్ , యువ సేవా సమితి ముఖ్య సభ్యులు పూర్వకంటి శ్యామ్, మల్లెల వెంకీ, పుట్ట అఖిల్, తీగవరపు చరణ్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.