Read News in Telugu Language
adsdaksha

శ్రీ దేవి శరన్నవరాత్రులు సందర్భంగా అన్నదానం..

దక్ష న్యూస్, ఖమ్మం (కూసుమంచి ), అక్టోబర్ 21

శ్రీదేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కూసుమంచి ( kusumanchi ) మండలంలో పలు గ్రామాల్లో శనివారం అన్నదాన కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలను పాలేరు ఎమ్మెల్యే సతీమణి కందాళల విజయమ్మ ( kandala vijayamma ) ,కుమార్తె దీప్తిక ,కూసుమంచి ఎమ్మార్వో సతీష్ , తదితరులు ప్రారంభించారు, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కౌండిన్య దళం గౌడ్ సంఘం ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రుల్లో ఏడవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారి కి పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరైన కందాళ విజయమ్మ, వారి కుమార్తె దీప్తిక వారి కుటుంబ సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

read also : ఢిల్లీలో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ చర్చ.. అయినా తేలని పొత్తు..

అనంతరం అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతిరోజు అమ్మవారికి మూడుసార్లు పూజా హారతి, కళాకారుల తో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూసుమంచి లో నివసిస్తున్న సభ్యులందరికీ తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఈ సందర్భంగా కందాళ విజయమ్మ తెలిపారు. విగ్రహ దాత మంద నాగులు వారి కుటుంబ సభ్యులకు వారి తరపున అందరికీ దేవీ నవరాత్రులు, విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.

Hospital

read also : తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు మార్గదర్శకాలను పాటించాలి..

కూసుమంచి ఎమ్మార్వో సతీష్ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు, అన్నదానికి సుమారు1600 మంది భక్తులు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో కూసుమంచి సర్పంచ్ చిన్న మోహన్ ఎంపీపీ శీను, మాజీ సర్పంచ్ భారీ వీరభద్రం, ఆశిక్ పాషా సీతా రాములు, బాలకృష్ణ రెడ్డి వేముల వీరయ్య, ఎంపీటీసీ ఉపేందర్ , జొన్నలగడ్డ రవి , రామకృష్ణ మంద నాగులు గౌడ్, మంద నాగేశ్వరరావు గౌడ్ ( సీఎం ) మంద ప్రసాదు గౌడ్, మంద శేఖర్ మంద రాంబాబు గౌడ్, మంద చిన్న వెంకన్న గౌడ్, విష్ణు గౌడ్, మోహన్ గౌడ్, పెద్ద వెంకన్న, అర్వపల్లి సాయి, అర్వపల్లి ఉదయ్ గౌడ్, అర్వపల్లి శీను, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కనకదుర్గ దేవి నవరాత్రి ఉత్సవాల్లో సాయంత్రం జరిగిన పూజా కార్యక్రమాల్లో కూసుమంచి సిఐ జితేందర్, కూసుమంచి ఎస్సై రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.