Read News in Telugu Language
adsdaksha

సాగర్ సరసన లేక్ ఫ్రంట్ పార్క్.. ఆదివారం నుంచి అనుమతి..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 30

చారిత్రాత్మక జలాశయం హుస్సేన్ సాగర్ ( hussain sagar ) సరసన హైదరాబాద్ ( hyderabad ) మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (hmda) తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ ( lake front park ) ఆదివారం (అక్టోబర్ ఒకటో తేదీ) నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నది. దాదాపు రూ.26.65 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న లేక్ ఫ్రంట్ పార్క్ ను గత మంగళవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) ప్రారంభించిన సంగతి తెలిసిందే. లేక్ ఫ్రంట్ పార్క్ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండనున్నది.

read also : 3 వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ..

ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు వాకర్స్ టైమింగ్స్ గా నిర్వాహకులు నిర్ణయించారు. నెలకు రూ.100/- ల చొప్పున చెల్లించి మార్నింగ్ వాకర్స్ ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు. లేక్ ఫ్రంట్ పార్కులో రూ.11,000/- లు చెల్లించి ప్రత్యేకంగా బర్త్ డే ఫంక్షన్స్, గెట్ టుగెదర్ ఫంక్షన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వంద మందికి మించకుండా చేసుకునే సదుపాయాన్ని కూడా హెచ్ఎండిఏ కల్పిస్తుంది.

Hospital

లేక్ ఫ్రంట్ పార్క్ లో కరాచీ బేకరీ అవుట్ లెట్ తో పాటు మరికొన్ని అవుట్ లెట్స్ సందర్శకుల కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

read also : వారెంట్ లేని కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేయండి..

Leave A Reply

Your email address will not be published.