Read News in Telugu Language
adsdaksha

పీవీ మార్గ్ లో లేక్ ఫ్రంట్ పార్క్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 26

ట్యాంక్ బండ్ సరసన మరో ఆహ్లాదకర ఆవిష్కరణ..

హర్షం వ్యక్తం చేస్తున్న నగర వాసులు..
హైదరాబాద్ ( hyderabad ) ట్యాంక్ బండ్ ( tank bund )  సరసన మరొక ఆహ్లాదకర పర్యాటక కేంద్రం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (hmda) ఆధ్వర్యంలో రూ.26.65 కోట్ల వ్యయంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న లేక్ ఫ్రంట్ పార్క్ ( lake front park )  ను మంగళవారం రాత్రి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ( cm kcr ) , మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ( kt ramarao ) కార్యదక్షతతో రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

read also : దసరా నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకం..

Hospital

ఎంఎయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ ముంబయి ఆర్కిటెక్ట్ కిషోర్ ప్రదాన్ తో లేక్ ఫ్రంట్ పార్క్ ను డిజైన్ చేయించినట్లు వెల్లడించారు. రాత్రి పదకొండు గంటల వరకు లేక్ ఫ్రంట్ పార్క్ సందర్శకులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, బుద్ద పూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్డీ చంద్రారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వప్రసాద్ లతో పాటు హెచ్ఎండిఏ అధికారులు, అర్బన్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

read also : కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి ..

Leave A Reply

Your email address will not be published.