Read News in Telugu Language
adsdaksha

మేడిగడ్డ వద్ద 144 సెక్షన్ అమలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 23

నదులకు నడకలు నేర్పిన అపర భగీరధుడు ఎక్కడ : బండి సంజయ్

కాళేశ్వరం ( kaleswaram) ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ( medigadda ) లక్ష్మీ బ్యారేజీ ( lakshmi bareg ) పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపుతోంది. దాంతో భూపాలపల్లి జిల్లా ( bhupalapalli district ) మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. సోమవారం మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించారు. 20 పిల్లర్ సింక్ కావడంతో గేట్ విరిగినట్లు వెల్లడించారు. లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత నీటి ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తి 45,260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 12,240 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 45,260 క్యూసెక్కులు.. కాగా.. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ లో 0.632 టీఎంసిలు నీటినిలువ ఉంచారు.

read also : గాజా నగరంపై భూతల దాడులు ..ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 266 మంది మృతి..

అయితే.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించడంతో.. టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్యారేజ్ వంతెన కుంగడంతో 20,21 పిల్లర్ వద్ద బాంబు పేలినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీ శబ్ధంతో వంతెన కుంగడంతో సంఘవిద్రోహుల చర్యగా అనుమానం రావడంతో.. బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, డాగ్ స్కాడ్ రంగంలోకి దిగింది. బ్యారేజ్ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Hospital

నదులకు నడకలు నేర్పిన అపర భగీరధుడు ఎక్కడ : బండి సంజయ్

నదులకు నడకలు నేర్పిన అపర భగీరధుడు కేసిఆర్ ఎక్కడ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని అందుకు గతంలో బాహుబలి మోటార్లు మునిగిపోవడం, నేడు మేడిగడ్డ కృంగిపోవడం నిదర్శనం అని బండి సంజయ్ విమర్శించారు. సోమవారం కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో జమ్మి పూజ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవటం పట్ల దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

read also : రెండు రైళ్లు ఢీ.. బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరువు తీస్తోందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై బండి సంజయ్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీయే దీనికి బాధ్యత వహించాలని అన్నారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని బండి డిమాండ్ చేశారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి దారుణం ఉండేదని గుర్తు చేశారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ నాణ్యతా ప్రమాణాల పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నేతలు ప్రాజెక్టును సందర్శిస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రాలేరనే నాణ్యతకు తిలోదకాలు వదిలారని ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే తమ పార్టీ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.