Read News in Telugu Language
adsdaksha

అద్వానీకి భారతరత్న.. ప్రధాని మోడీ కీలక ప్రకటన..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 3

బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న వరించింది. ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ శనివారం పంచుకున్నారు. ఎల్కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ, ఆయన 1927 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రస్తుత పాకిస్తాన్ (భారత్ విభజన కాకముందు) లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. అలాగే పాక్లోని హైదరాబాద్ లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను చదివారు. 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు నిర్వర్తించారు.

Read also: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కారు దిగిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య..

Hospital

బీజేపీ వ్యవస్థాపకుల్లో అద్వానీ కూడా ఉన్నారు. అద్వానీకి భారతరత్న రావడంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ పీఎం ట్వీట్ చేశారు. అద్వానీ ఈ గౌరవం పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్న మోదీ.. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు. అద్వానీ జీ రాజనీతిజ్ఞుడు, కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగిన వ్యక్తి అంటూ మోడీ కొనియాడారు. 90వ దశకంలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథ యాత్ర చేశారని మోడీ గుర్తు చేశారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప అంతర్దృష్టులతో నిండి ఉన్నాయి అని కొనియాడారు.

Read also: ప్రజావాణిలో 10 స్పెషల్ కౌంటర్లు.. నెక్ట్స్ వీక్ నుంచే అమలు ..

దివంగత ప్రధాని వాజ్ పేయీ హయాంలో 2002 నుండి 2004 వరకు భారతదేశానికి 7వ ఉప ప్రధానిగా అద్వానీ పనిచేశారు. అలాగే అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంట్ లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. 2015లో అద్వానీ పద్మవిభూషణ్ అందుకున్నారు. అద్వానీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను అంటూ మోడీ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.