Read News in Telugu Language
adsdaksha

లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారత్‌ విద్యార్థి మృతి..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 25

భారత్‌కు చెందిన చేష్టా కొచ్చర్ లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ (LSE)లో పీహెచ్‌డీ(PHd) చేస్తోంది. నీతి ఆయోగ్ మాజీ సీఈవో(CEO) అమితాబ్ కాంత్ ‘ఎక్స్’ (X)వేదికపై ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకుముందు ఆమె నీతి ఆయోగ్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ కోసం పనిచేశారు.
చేస్తా కొచ్చర్ నీతి ఆయోగ్‌లో ‘లైఫ్'(Life) కార్యక్రమంలో పనిచేశారు. బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసేందుకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు వెళ్లారు. సైకిల్ తొక్కుతూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. చాలా తెలివైన వ్యక్తి. ధైర్యవంతురాలు. వారు చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని అమితాబ్ కాంత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మార్చి 19న ప్రమాదం..

Hospital

మార్చి 19న ఎల్‌ఎస్‌ఈ నుంచి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా ట్రక్కు ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్ కొంత దూరంలో ఉన్నాడు. వెంటనే వచ్చి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందారు. మృతదేహాన్ని తీసుకురావడానికి ఆమె తండ్రి లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ (రిటైర్డ్) లండన్ చేరుకున్నారు.

చేష్టా గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు. సెప్టెంబర్‌లోనే పీహెచ్‌డీ కోసం అక్కడికి వెళ్లారు. అంతకుముందు 2021-23 మధ్య నీతి ఆయోగ్ లోని నేషనల్ బహేవియరల్ ఇన్సైట్స్ యూనిట్లో సీనియర్ సలహాదారుగా సేవలందించారు.

Leave A Reply

Your email address will not be published.