Read News in Telugu Language
adsdaksha

అంతరిక్షం నుంచి వెలువడిన ‘తొలి కాంతి’.. భూమికి అందిన అద్భుతం లేజర్ కమ్యూనికేషన్ లింక్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : నవంబర్ 23

10 మిలియన్ మైళ్ల దూరం నుంచి మెసేజ్..

సైక్ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి ఈ ప్రయోగం..

Hospital

వివరాలు వెల్లడించిన నాసా శాస్త్రవేత్తలు..

అంతరిక్షం నుంచి మొట్టమొదటిసారిగా లేజర్ కమ్యూనికేషన్ ( laser communications ) సందేశం భూమిపైకి అందింది. 10 మిలియన్ మైళ్ల దూరం నుంచి ఈ మెసెజ్ అందిందని నాసా శాస్త్రవేత్తలు గురువారం వెల్లడించారు. అయితే ఈ దూరం భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 40 రెట్లు సమానమని, అత్యంత దూరం నుంచి భూమి మీదకు అందిన ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇదేనని శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించినట్టయ్యింది. అయితే డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్(డీఎస్ఓసీ) పరికరం ద్వారా నాసాకు చెందిన ‘సైక్’ స్పేస్ క్రాప్ట్ నుంచి ఈ ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

అక్టోబరు 13న ప్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేశామని, అప్పటి నుంచి విజయవంతంగా భూమికి లెజర్ ప్రసార మెసెజ్ అందుతోందని వివరించింది. నవంబర్ 14న కాలిఫోర్నియాలోని పాలోమర్ అబ్జర్వేటరీ వద్ద ఉన్న హేలీ టెలిస్కోప్‌తో ‘సైక్ స్పేస్‌’ కమ్యూనికేషన్‌ సంబంధాన్ని ఏర్పరచుకుందని నాసా వివరించింది. టెస్టింగ్ సమయంలో డీఎస్‌వోఎస్‌కు చెందిన సమీప ఇన్‌ఫ్రారెడ్ ఫొటాన్లు 50 సెకన్లలో సైక్ నుంచి భూమికి చేరాయని, విజయవంతమైన ఈ మొదటి కమ్యూనికేషన్‌ లింక్‌ని ‘తొలి కాంతి’గా భావిస్తున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.