Read News in Telugu Language
adsdaksha

కంటోన్మెంట్ బరిలో లాస్యనందిత సోదరి ..ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 16

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ( lasya nanditha ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి లాస్యనందిత బీఆర్ఎస్ ( brs ) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ ( bjp ) నుంచి శ్రీ గణేష్, కాంగ్రెస్ ( congress ) నుంచి గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసిన సంగతి తెలిసిందే.

read also : కవితకు 7రోజుల కస్టడీ ..ఈడీ కార్యాలయానికి తరలింపు..

Hospital

ప్రస్తుతం కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పోటీలో ఎవరెవరు ఉంటారనే చర్చ సాగుతోంది. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదిత ( niveditha ) పోటీ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజే ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( kcr ) ను కలిశారు. దీంతో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

read also : ప్ర‌జాభ‌వ‌న్‌లో పాద‌యాత్ర సంబురాలు.. పీపుల్స్ మార్ఛ్ పాద‌యాత్ర‌కు ఏడాది పూర్తి ..

దివంగత నేత సాయన్న కూతురు నివేదిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేయడంపై స్పందించారు. తన తండ్రి సాయన్నను ఆదరించిన నియోజకవర్గ ప్రజలు తన సోదరి లాస్య నందితను గెలిపించారని, అయితే దురదృష్టవశాత్తు తన సోదరి ప్రమాదంలో చనిపోయిందని విలేకరులకు తెలిపారు. కంటోన్మెంట్ బరిలో ఉండాలని స్థానిక నాయకత్వం భావిస్తున్నదని.. వారందరి మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.