Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో మోదీ పర్యటన తేదీలు ఖరారు.. తొలి దశలో మూడు రోజులు ఎన్నికల ప్రచారం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 24

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ( pm narendra modi ) హాజరు కానున్నారు. ఈ మేరకు తేదీలు కూడా ఖరారయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక నియోజక వర్గాల్లో పార్టీ జెండాను ఎగరేసేందుకు ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ( telangana ) లో నరేంద్రమోదీ పర్యటన ఖరారయ్యింది. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో.. పార్టీలోని రాష్ట్ర, జాతీయ స్థాయి అగ్రనేతలు ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మొదటి దశలో మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 30వ తేదీతో పాటు వచ్చే నెల 3,4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 30వ తేదీన హైదరాబాద్ ( hyderabad ) లో వివిధ రంగాల్లో ప్రముఖలతో మోదీ సమావేశం అవుతారు. అదేరోజు అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మే 3వ తేదీన వరంగల్ ( warangal ) పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సభలోను మోదీ పాల్గొంటారు. అదేరోజు భువనగిరి ( bhuvanagiri ), నల్గొండ ( nalgonda ) నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్ నగర్ ( mahabub nagar, చేవెళ్ల ( chevella ) పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

Hospital

read also : రియల్‌మి నుంచి సరికొత్త నార్జో 70 5జీ, రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లు.. ఈ సాయంత్రం నుండే సేల్ ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మెదక్ పార్లమెంట్ లో రఘునందన్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో జోష్ నింపుతోంది.

Leave A Reply

Your email address will not be published.