Read News in Telugu Language
adsdaksha

సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 20

సార్వత్రిక ఎన్నికలకు (Loksabha 2024) తొలి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించేందుకు మార్చి 27 చివరి తేదీ, 28న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది.

read also : rajakar : రజాకార్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ..

అభ్యర్థి, అతని మద్దతుదారులు ప్రయాణించే వాహనాలను నామినేటింగ్ అధికారి కార్యాలయం నుండి 100 మీటర్ల దూరం వరకే అనుమతిస్తారు. ఎన్నికల అధికారి కార్యాలయంలోకి అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల అధికారి కార్యాలయంలోకి సిబ్బంది తప్ప ఇతరులెవరినీ అనుమతించరు.

Hospital

read also : కాంగ్రెస్.. పాంచ్ న్యాయ్.. 5 గ్యారంటీలతో హస్తం మేనిఫెస్టో రెడీ ..

అభ్యర్థులు తమ నామినేషన్లతో పాటు రూ.25 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 చెల్లించాలి. SC, ST అభ్యర్థులు తమ కుల గుర్తింపు పత్రాలను నామినేషన్‌తో పాటు సమర్పించాలి.

read also : dsp praneeth rao : ప్రణీత్ రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు .. కీలక సమాచారం సేకరించిన పోలీసులు..

తమిళనాడులో 39, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్‌లో 3, మణిపూర్‌లో 3, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌లో 2, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.