Read News in Telugu Language
adsdaksha

ఎన్నికల సమయంలో ‘ఉచిత హామీలు’ వద్దు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 20

సార్వత్రిక ఎన్నికల ( Loksabha Election ) తొలి నోటిఫికేషన్‌ విడుదలైన రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ఇస్తున్నాయని, వాటిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు (Supreme court) అంగీకరించింది. త్వరలో జాబితా చేయనున్నట్లు పేర్కొకొంది. ఉచిత హామీలు ప్రకటించే పార్టీల రిజిస్ట్రేషన్, గుర్తులను రద్దు చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారాలను ఉపయోగించాలని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

read also : బీఆర్‌ఎస్‌ని వదిలిపెట్టం.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ క్లారిటీ ..

Hospital

ఎన్నికల వాగ్దానాలపై వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అంశంపై విచారణ జరపాలని పిటిషనర్ తరపున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. “ఇది ఒక ముఖ్యమైన విషయం, రేపు బోర్డు ముందు ఉంచండి రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలపై చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.

read also : pmegp : పీఎంఇజిపి స్కీమ్ తో యువత కలలు సాకారం..

ప్రభుత్వ పథకాలపై రాజకీయ పార్టీలు చేస్తున్న అసంబద్ధ వాగ్దానాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని పిటీషనర్ తెలిపారు. ఇవి నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయని అన్నారు. రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచార చర్యలు రాజ్యాంగ ఉల్లంఘనేనని, వాటిని నిషేధించాలని పేర్కొన్నారు. వీటిపై తగిన చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.