Read News in Telugu Language
adsdaksha

మారోజు వీరన్న స్వగ్రామంలో ఖమ్మం నాయకుల ఘన నివాళులు..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 16

దేశంలో బహుజనులైన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి సంక్షేమం వ్యవస్థ మార్పుతోనే సాధ్యమని, అందుకు ఐక్య విప్లవ కార్యాచరణ అవసరమని గ్రహించి , దశాబ్దాల ముందే భారత విప్లవ పధాన్ని నిర్దేశించిన మారోజు వీరన్న భారత విప్లవ దార్శనీకుడని సామాజిక న్యాయ జె ఎ సి చైర్మన్ , ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బద్రు నాయక్, వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి కొనియాడారు.

read also : లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులుగా డాక్టర్ బొలికొండ ..

గురువారం మారోజు వీరన్న 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిజం , అంబేద్కర్ ఇజం రెండు కలగలిపి దేశంలో నూతన విప్లవ భావజాలం నిర్దేశించిన మారోజు వీరన్న నేటి విప్లవకారులకు మార్గదర్శకుడని తెలిఫారు.

Hospital

read also : 22 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..

మారోజు వీరన్న స్వగ్రామం సూర్యాపేట జిల్లాలోని కరివిరాల కొత్తగూడెం లో మారోజు వీరన్న స్తూపం , విగ్రహం ఎదుట నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దివంగత మారోజు వీరన్న సతీమణి చైతన్య , దిశా, మారోజు వీరన్న కుటుంబ సభ్యులు , గ్రామ పెద్దలు వీరనారీమణుల ఆశయ సాధన సమితి గౌరవ అధ్యక్షురాలు ఎస్.కె.నజిమా నాయకులు జ్యోతి , చందు , త్రివేణి , వీరన్న నాయక్ , రవీంద్ర నాయక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.