Read News in Telugu Language
adsdaksha

జర్నలిస్టుపై దాడులను అరికట్టాలి : మాచర్ల

మణుగూరు, సెప్టెంబర్ 22 , దక్ష న్యూస్:

ఇటీవల కాలంలో  జర్నలిస్ట్ ( journalist ) లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని టియుడబ్ల్యూజే టీజే ఎఫ్ ( tuwj tjf )  మణుగూరు డివిజన్ అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ ( macharla srinivas ) అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం ( bhadradri kottagudem ) జిల్లా ఆళ్లపల్లి మండలంలో మన తెలంగాణ విలేకరి సత్యనారాయణ రాజు పై స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిజాలను నిర్భయంగా రాస్తున్న విలేకరులను దూషించడం, దాడులు చేయడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు జరిగిన విషయాన్ని సమాజానికి తెలియజేసే హక్కు ఉందని, అందులో భాగంగానే స్వేచ్ఛగా వార్తలు రాస్తున్న విలేకరులను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ దాడులకు పాల్పడుతున్న వారిని పోలీసుశాఖ వారు చట్టపరమైన శిక్షలను విధించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Hospital

అనంతరం మణుగూరు సీఐ బాలాజీ వరప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ సభ్యులు కృష్ణమోహన్, రాపర్తి శ్రీహరి, డివిజన్ కమిటీ సభ్యులు షాభిర్ పాషా, దాసరి వెంకటేశ్వర్లు, భోగా ఓదేలు, బండి రాజయ్య, కృష్ణ ప్రసాద్, పునేమ్ రమేష్, కర్నె బాబు, పొదిళ్ల వీరబాబు, చారి, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.