Read News in Telugu Language
adsdaksha

22 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 16

22 ఏళ్ళ తర్వాత వాట్సాఫ్ వేదిక పుణ్యమా అని ఆ బాల్య స్నేహితులు ఒక్కటయ్యారు. ఒకరినొకరు చూసుకున్న ఆనందంలో తబ్బుబ్బయి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. తాము కలిసి చదువుకున్న తరగతి గదులు, తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు, తాము ఆడుకున్న పాఠశాల పరిసరాలు తనివితీరా చూసుకొని గత కాలపు అనుభూతులను స్నేహితులతో పంచుకొని అంతులేని ఆనందాన్ని పంచుకున్నారు.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-2002 విద్యా సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు గురువారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. ఇరవై రెండు ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు.

read also : వేసవి సెలవుల్లో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న తాజ్ మహల్ ఎగ్జిబిషన్..

Hospital

వాట్సప్ వేదికగా గత మూడు నెలల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే గ్రామాలకు చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు.

చిన్ననాటి మిత్ర తాము చదువుకునే రోజులు… చేసిన అల్లరి… స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్​లు… ఇలా గడిచిన మధురమైన రోజుల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ తమ అనుభూతుల్ని కుటుంబ సభ్యులతోను పంచుకున్నారు.

read also : బహు ముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆయేషా సుల్తానా ..

తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మృతి చెందిన గురువులు, స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. పూర్వపు ఉపాధ్యాయులు, రిటైర్డ్ హెడమాస్టర్ కృష్టణమూర్తి, రమణ (పీటీ ), దయాకర్ (హిందీ ) రమణ (ఇంగ్లీష్ ) తెరాల వెంకన్న (ట్యూషన్), రామకృష్ణ (ప్రైమరి), కృష్ణరెడ్డి (మాథ్స్ ) విజయలక్ష్మి(తెలుగు )లను ఘనంగా సత్కరించారు.

పూర్వపు విద్యార్థులు కొత్తపల్లి కిరణ్, చల్లా జగన్నాధం, పడిశాల మధుసూదన్ రావు, కందుల మోహన్ రెడ్డి, యరబోలు శ్రీనివాస్ రెడ్డి, తంగేళ్ళ ఉపేందర్, వందనపు కిరణ్, బింగి అంబేద్కర్, కేతిరెడ్డి గీత, యరబోలు కృష్ణవేణి, కవిత, బాణాల విజయలక్ష్మి, గోపిరెడ్డి కృష్ణ కుమారి, పుష్ప, చైతన్య, వసంత లక్ష్మి, సునీత, బండారు పల్లి శ్రీనివాస్ రావు, వీరభద్రం, జానీ పాషా తరితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.