Read News in Telugu Language
adsdaksha

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.. ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి బిజేపి ప్రయత్నిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 13

హైదరాబాద్ పాతబస్తీలో ఓ పోలింగ్ కేంద్రంలో పరిశీలనకు వెళ్లిన
బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ( madhavi latha ) పై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ ( fir ) నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళలను అవమానించారని ఎన్నికల సంఘానికి ఎంఐఎం ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. పాతబస్తీలో ఓ పోలింగ్ కేంద్రంలో పరిశీలనకు వెళ్లిన మాధవీలత.. ఓటర్ ఐడీ చెక్ చేస్తూ ముస్లిం మహిళలను బుర్కా తొలగించాలని ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి.

read also : ఆటైనా సీటైనా అదే పోరాటం.. గచ్చిబౌలి మైదానంలో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి..

చెక్ చేసే హక్కు నాకుంది: మాధవీలత..

Hospital

ఈ వివాదంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “నేను అభ్యర్థిని. చట్ట ప్రకారం ముఖానికి మాస్క్‌లు లేకుండా ఓటర్ ఐడి కార్డులను తనిఖీ చేసే హక్కు అభ్యర్థికి ఉంది. నేను పురుషుడిని కాదు, స్త్రీని. కాబట్టే చాలా వినయపూర్వకంగా నేను వారిని అభ్యర్థించాను. ఎవరైనా దీన్ని పెద్ద సమస్యను చేయాలనుకుంటే వారు భయపడున్నారని అర్థమవుతోంద”ని అన్నారు.

read also : కాంగ్రెస్ కు మద్దతుగా ముస్లీం జేఏసి సమావేశం..

స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో పై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నేను ఆ వీడియో చూడలేదు. ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇలాంటివన్నీ అసదుద్దీన్‌ ఒవైసీ విజయానికి దోహదపడతాయి. దాని వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.