Read News in Telugu Language
adsdaksha

బాలల సర్వతోముఖాభివృద్ధికి చొరవ చూపండి : అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జనవరి 20

బాలల సంరక్షణతో పాటు వారి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు ( madhusudhan raju ) అన్నారు. శనివారం ఐ డి ఓ సి ( idoc ) సమావేశ మందిరంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల ఆరోగ్యంతో పాటూ వారి సర్వతోముఖాభివృద్ధికి అధికారులు చొరవ చూపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. అనంతరం బాలల సంక్షేమ అధికారిని విజేత మాట్లాడుతూ, చైల్డ్ కేర్ ప్లాన్ కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లల ఆరోగ్యం, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బాల బాలికలకు స్కిల్ డెవలప్మెంట్ పరంగా శిక్షణలు ఇస్తున్నట్లు విజేత వెల్లడించారు. ఏడుగురు బాల కార్మికులను రక్షించి బాలల సదన్ కు తరలించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు ఇటలీకి ఇద్దరు, అమెరికాకి ఇద్దరు, ఇతర దేశాలకు 17 మంది పిల్లల్నిజిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దత్తతకు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రుల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు తనిఖీ చేసి సంతృప్తి చెందిన తర్వాత, చట్ట ప్రకారం అన్ని విధివిధానాలు పూర్తి చేసి మొత్తం 19 మంది పిల్లల్ని వారి బంగారు భవిష్యత్తుకు ఉత్తమ కుటుంబాల తల్లిదండ్రులకు దత్తత ఇచ్చినట్లు సంక్షేమ అధికారిని విజేత తెలిపారు.

Hospital

బాల్యవివాహాల్ని అరికట్టడంలో భాగంగా 2017 వ సంవత్సరంలో 18, 2018లో 18, 2019లో-29, 2020లో -25, 2021 లో -17, 2022లో -50, 2023లో -50, 2004లో ( నేటి వరకు ) 1 బాల్యవివాహాల్ని ఆపినట్లు ఆమె తెలిపారు.

మిషన్ వాత్సల్య స్కీం అనుసరించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 714 మంది కి నెలకు 4000 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు చెప్పారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించి బాలికల పాఠశాలల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలుచేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి విజయ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారిని ఇందిర, మైనారిటీ వెల్ఫేర్ అధికారి సంజీవరావు, డిసిపిఓ ఎం. హరి కుమారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రవి, డబ్ల్యూ సి మెంబర్స్ సుమిత్ర, అంబేద్కర్, సాధిక్ పాషా, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.