Read News in Telugu Language
adsdaksha

370 సీట్లు పక్కా.. బీజేపి యాట్రిక్ కొడుతుంది : మోడీ

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : ఫిబ్రవరి 11

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు పక్కా అని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో యన్డీఏ గవర్నమెంట్ యాట్రిక్ కొడ్తుందని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఝబువలో రూ.7,550 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవకు తాము కట్టుబడి ఉన్నామని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అభివృద్ధి పనులు డబుల్ స్పీడ్‌తో ముందుకు దూసుకుపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని వస్తుండటంపై చాలా చర్చ జరుగుతోందని, లోక్‌సభ ఎన్నికల పోరాటాన్ని ఝబువా నుంచి ప్రధాని ప్రారంభించనున్నారని కొందరు చెబుతున్నారని, అయితే తాను ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని అన్నారు.

Hospital

Read also: ముందు ముక్కు నేలరాయి.. కేసీఆర్ ఆ తర్వాతే నల్గొండకు రా : మంత్రి కోమటిరెడ్డి..

గిరిజన కమ్యూనిటీ తమకు ఓటు బ్యాంకు కాదని, దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని కూడా ఈ సందర్భంగా మోదీ వివరించారు. ”ఆహార్ అనుదాన్ యోజన” కింద సుమారు రెండు లక్షల మంది మహిళా లబ్దిదారులకు నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లను అందజేశారు. ఈ పథకం కింద మహిళలకు, ముఖ్యంగా వెనుకబడిన తెగల మహిళలకు పౌష్టికాహారం కోసం నెలకు రూ.1,500 చొప్పున అందిస్తున్నారు. SVAMITVA పథకం కింద 1.75 లక్షల ‘అధికార్ అభిలేఖ్’ (భూమి హక్కుల రికార్డు)ని కూడా ప్రధాని పంపిణీ చేశారు. ఈ పథకం ప్రజలకు వారి భూమిపై అన్ని అధికారాలు కల్పించనుంది. గిరిజన యువకుల కోసం రూ.170 కోట్లతో ఏర్పాటు చేస్తున్న తాంత్యా మాలా భిల్ యూనివర్శిటికీ కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. దీనికి ముందు, ఝబువా ప్రధాని రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రధాని వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా రోడ్‌షోలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.