Read News in Telugu Language
adsdaksha

modi : మారిన ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ..

దక్ష న్యూస్, హైదరాబాద్‌: సెప్టెంబర్ 28

ప్రత్యేక విమానంలో నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు..

ప్రధాని మోడీ ( modi ) మహబూబ్‌నగర్‌ ( mahabubnagar ) జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబరు 1న హైదరాబాద్‌ ( hyderabad ) తోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో ఆయన పలు అభివృద్ధి పనులకు బేగంపేట ఎయిర్‌పోర్టు ( begumpet airport ) లోనే శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్‌ మేరకు ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్టుకు కాకుండా ప్రత్యేక విమానంలో నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ( shamshabad airport ) కు చేరుకోనున్నారు.

read also : 29న మంత్రివర్గ సమావేశం..?

Hospital

అక్టోబరు 1న మధ్యాహ్నం 1.30 కు ప్రధాని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.35 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయల్దేరి వెళతారు. 2.10గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరకుని 2.50 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

అనంతరం 3 గంటల నుండి 4 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 4.10 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తారు. సాయంత్రం 4.50గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ కి తిరిగి వెళ్లనున్నారు…

read also : తెలంగాణ గ్రామీణ పర్యాటకానికి కేంద్ర పర్యాటక శాఖ అవార్డులు..

Leave A Reply

Your email address will not be published.