Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ వచ్చాక మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగింది..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 16

తెలంగాణ వచ్చాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 60 యేళ్లు అధికారంలో ఉండి మైనార్టీలకు చేసింది ఏమి లేదన్నారు. ఎటువంటి పథకాలు మైనారిటీలకు అందించలేదని మహమూద్ అలీ పేర్కొన్నారు.

అంతకముందు ముస్లింలు ఎక్కువగా హోటల్, మెకానిక్ పనులు చేసేవారు. కెసిఆర్ సిఎం అయిన తర్వాత ముస్లిం ల కోసం స్కూల్, కాలేజ్ లు నిర్మించి ముస్లింల అభివృద్ధికి కృషి చేశారన్నారు. మైనార్టీల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం రూ. 24 వందల కోట్లు ఖర్చు చేసిందని మహమూద్ అలీ తెలిపారు.

ఎంతోమంది ముస్లింల పిల్లలకు బీఆర్ఎస్ అండగా నిలిచిందన్నారు. ఎన్నికలు రాగానే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. షాధి ముభారక్ పథకం ప్రవేశపెట్టి ముస్లిం ఆడబిడ్డలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ముస్లిం మహిళలకు షాది ముబారక్ పథకం అందించినట్లు తెలిపారు.

Read also : ప్రతీ ఓటర్ కి స్లిప్పులు అందేలా చూడండి..

2014 నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరోజు కర్ఫ్యూ విధించలేదు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండు అధికారంలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు కర్ఫ్యూ విధించేవారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

తెలంగాణ రాక ముందు మన దగ్గర అస్సలు కరెంట్ ఉండేది కాదు..ఇండస్ట్రియల్ లకు, రైతులకు సరిగా కరెంట్ కూడా ఇచ్చేవారు కాదు.. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. 24గంటలు విద్యుత్ ఉంటుందన్నారు.

Hospital

కేటీఆర్ నేతృత్వంలో ఇతర దేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయని మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో నీటి కొరత ఉండేది, మిషన్ భగీరథతో సీఎం కెసిఆర్ ఆ కొరతను అధిగమించారన్నారు.

దేశంలో ఇంటింటికీ నల్లా పెట్టించిన ఘనత కేవలం సీఎం కెసిఆర్ కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలో బియ్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని..రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాదు ఆయన ఆర్ఎస్ఎస్ కు చెందిన నాయకుడన్నారు.

కాంగ్రెస్ పార్టీకి 20 మంది సీఎం లు ఉన్నారు.. బీఆర్ఎస్ కు కేవలం ఒక్కరే సీఎం అది కెసిఆర్ అన్నారు. ముస్లిం సోదరులారా మన అభివృద్ధికి కృషి చేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.. మనం బీఆర్ఎస్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

Read also : నా నామినేషన్ రిజెక్ట్ చేయించాలని చాలా కష్టపడుతున్నారు…

దేశానికి స్వాతంత్య్రం అందించింది మహాత్మా గాంధీ, రాష్ట్రానికి స్వాతంత్య్రం అందించింది సీఎం కెసిఆర్. తెలంగాణ గాంధీ సీఎం కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. మతం వేరు రాజకీయం వేరు..
హైదరాబాద్ పాతబస్తీలో కేవలం ఉర్దూ మాత్రమే మాట్లాడతారు. తెలుగులో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు వస్తాయి. గతంలో ఖమ్మం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించి ఓటు వేయాలన్నారు.

అజయ్ అన్న చాలా మంచి వారని ఆయనకు ఓటు వేసి గెలిపించాలని మహమూద్ అలీ కోరారు. సీఎం కెసిఆర్ కు మరో అవకాశం ఇచ్చి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలన్నారు.
బీఆర్ఎస్, కేసిఆర్ గెలుపు కోసం ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.