Read News in Telugu Language
adsdaksha

mahesh : మహేష్ బాబు రాజకీయ ఆరంగేట్రం..వైసీపీలోకి ఎంట్రీ..?

దక్ష న్యూస్, హైదరాబాద్: ఆగస్ట్ 29

చిత్ర రంగం ఇచ్చిన స్టార్ డమ్‌తో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉన్న టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ( mahesh babu ) రాజకీయాల ద్వారా అయితే మరింత మంచికి సేవ చేయవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తన బాబాయ్ ఆదిశేషగిరిరావు ( adisheshagirirao ) వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నందున వైసీపీ ( ycp ) లోకి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అంతే కాదు అందుకు మహేష్ బాబు ముహూర్తాన్నీ నిర్ణయించుకున్నారట. ఇప్పుడీ సంగతి సినిమా సర్కిల్ లో హాట్ టాపిక్‌గా మారింది.

Hospital

read also : హైదరాబాద్ లో వినాయక చవితి మండపాల కు బంపర్ ఆఫర్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి డా.రాజశేఖర్ రెడ్డి ( dr. rajashekhar reddy ) వర్ధంతి కార్యక్రమాన్ని వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అదే రోజున సీఎం జగన్ ( cm jagan ) సమక్షంలో మహేష్ బాబు వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. విషయాన్ని కుటుంబ సభ్యులతోనూ చర్చించి, సూపర్ స్టార్ ( super star ) వైసీపి లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే పోటీ ఎక్కడినుండి చెయ్యాలనే విషయం సీఎం జగన్ సూచనల మేరకు నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.