Read News in Telugu Language
adsdaksha

మకరజ్యోతి దర్శనం.. పోటెత్తిన భక్త జనం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 15

అయ్యప్పల శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి. మకరజ్యోతి ( makara jyothi )దర్శనంతో భక్తజన హృదయం హరి హరుడి నామస్మరణతో పులకించిపోయింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కేరళలోని శబరిమల కొండపై అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడుపై మూడుసార్లు జ్యోతి దర్శనమివ్వడంతో భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది.

మకరజ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలలనుండి లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులకు శబరిమల చేరుకున్నారు. సంక్రాంతి రోజున ఈ దివ్య దర్శనం తన్మయత్వం చెందారు. పొన్నాంబలమేడుపై మూడుసార్లు మకరజ్యోతి దర్శనమిచ్చింది.

Hospital

రవి ధనుస్సు రాశి నుంచి.. మకర రాశిలోకి ప్రవేశించే వేళ… ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవగా.. మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది. స్వామివారి దర్శనాల కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

read also : మంత్రి పొంగులేటి సంక్రాంతి శుభాకాంక్షలు..

కాగా, భక్తులకోసం ఆలయ నిర్వాహకులు గత కొద్ది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. పంబానది, సన్నిధానం, హిల్‌ టాప్‌తో పాటు టోల్‌ ప్లాజా సమీపంలో అదనపు భద్రత ఉంది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం దాదాపు వందలాది మంది పోలీసులు పనిచేశారు. సంక్రాంతి పండుగ రోజు మకరజ్యోతి దర్శనంతో భక్తులు ఆనందంతో హరిహరుడికి జేజేలు పలుకుతూ వెనుదిరిగారు.

Leave A Reply

Your email address will not be published.