Read News in Telugu Language
adsdaksha

ఒకే దేశం-ఒకే ఎన్నిక అనే ఆలోచనను పక్కనపెట్టండి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 19

– కేంద్రానికి ఖర్గే లేఖ..

ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే ఆలోచనను పక్కనపెట్టాలని, అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీని సైతం రద్దు చేయాలని మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge ) డిమాండ్​ చేశారు. లోక్‌సభ, వివిధ రాష్ట్రాల శాసనసభలకు, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్​ పార్టీ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒకే దేశం-ఒకే ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ సెక్రటరీ నితేన్​ చంద్రకు శుక్రవారం లేఖ రాశారు. పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే, ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే ఆలోచనను పక్కనపెట్టాలని, అలాగే ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీని సైతం రద్దు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

read also : మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్లాన్ ..లండన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి..

Hospital

రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా మాజీ రాష్ట్రపతి సేవలను ఇందుకోసం వాడుకుంటోందని ఖర్గే ధ్వజమెత్తారు. ఈ చర్యను ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్యానెల్​ కమిటీ ఛైర్మన్​గా వ్యవహరిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖలో పేర్కొన్నారు. ప్రజల పక్షాన, కాంగ్రెస్​ పార్టీ తరఫున కమిటీ ప్యానెల్​కు ఈ మేరకు అభ్యర్థిస్తున్నామని చెప్పారు. జమిలి ఎన్నికలపై కేంద్రం, కోవింద్​ కమిటీ చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని, ఈ విషయంలో వారు నిజాయితీతో వ్యవహరించాలని పేర్కొన్నారు.

read also : విజయవంతంగా ముగిసిన రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ..

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే కాకుండా ప్రజల ఆలోచనలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పార్లమెంటు, కేంద్ర ఎన్నికల సంఘంపై ఉన్నాయని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం ఈ మూడు వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలని వివరించారు. ఇలాంటి ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవడం రాజ్యాంగంలోని ఫెడరల్​ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ గతేడాది అక్టోబరు 18న ప్యానెల్​ కమిటీ కార్యదర్శి నితేన్​ చంద్ర ప్రతిపక్షాలు సహా దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే దీనికి ప్రతిస్పందనగా తాజాగా కాంగ్రెస్​ అధ్యక్షుడు ఖర్గే ఈ వ్యవహారంపై తమ పార్టీ వైఖరిని మరోమారు లేఖ ద్వారా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.