Read News in Telugu Language
adsdaksha

భారతంలోనే అతిపెద్ద కుంభకోణం బాండ్ల స్కీమ్ ..కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపణ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 16

ఎన్నికల బాండ్ల స్కీమ్ స్వతంత్ర భారతదేశం చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( mallikarjun kharge ) ఆరోపించారు. ఎన్నికల సంఘం బయటపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వివరాల నేపథ్యంలో బీజేపీ( bjp ) అనుసరిస్తోన్న అవినీతి వ్యుహాలను బహిర్గతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ 50 శాతం విరాళాలు పొందగా, కాంగ్రెస్‌ ( congress ) కు 11 శాతం వచ్చాయని తెలిపారు. బడా వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో ఆ పార్టీకి నిధులు ఏలా సమకూర్చారు.? విరాళాలు ఇచ్చిన వారిలో ఎక్కువగా ఈడీ ( ed ), ఐటీ ( it ) ల దాడులను ఎదుర్కొన్నవారేనని గుర్తు చేశారు.

read also : మల్కాజ్ గిరిలో మోడీ రోడ్ షో కి అపూర్వ స్పందన ..నేడు నాగర్ కర్నూల్ లో భారీ బహిరంగ సభ..

Hospital

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తే ఎన్నికలకు తాము ఏలా వెళ్లాలని ఖర్గే ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల పేరుతో బీజేపీ రూ.కోట్లు సేకరించిందని, వారికి రూ.6వేల కోట్ల విరాళంగా రావడం అనుమానాలను రేకేత్తిస్తోందని చెప్పారు. వీటిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని, అప్పటివరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని పేర్కోన్నారు. ఈవీఎంలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, వీవీప్యాట్‌ల స్లిప్పుల అంశంపై తమ వినతిని తెలిపేందుకు ఏడాదిగా ప్రధాన ఎన్నికల కమిషనర్ అపాయింట్‌మెంట్ కోరుతున్నా.. అటు నుంచి స్పందన లేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను కలిసేందుకు ఎన్నికల సంఘం ఎందుకు భయపడుతోందని నిలదీశారు.

read also : సీఏఏ ఆందోళన కలిగిస్తోంది ..అగ్రదేశం అమెరికా స్పందన..

 

Leave A Reply

Your email address will not be published.