Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ లోకి భారీ చేరికలు .. హస్తం గూటికి నీలం మధు , మోత్కుపల్లి, నేతి, కపిలవాయి ..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 27

ఢిల్లీలో ఖర్గే సమక్షంలో చేరిక ..

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ (brs ) నేత నీలం మ‌ధు ( neelam madhu ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్ర‌వారం ఏఐసీసీ ( aicc ) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ( mallikarjun kharge ) సమక్షంలో హ‌స్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయనకు పటాన్ చెరువు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. కాగా, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌టాన్‌చెరువు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్ త‌ర‌పున టికెట్ ఆశించిన నీలం మ‌ధుకు నిరాశ ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీఎం కేసీఆర్ ( cm kcr ) టికెట్ కేటాయించ‌డంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌ ( congress ) లో చేరడంతో పటాన్ చెరువు కాంగ్రెస్ టికెట్‌ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది.

తెలంగాణలో 60 లక్షలు ఓట్లు గల ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించిన కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తారని నీలం మధు అభిమానులు చెబుతున్నారు. మధు చేరిక కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చింది. ముదిరాజ్ సామాజిక వర్గం, తన అభిమానులు, గత ఐదు సంవత్సరాల నుంచి పటాన్ చెరు నియోజకవర్గంలో ఎన్ఎంఆర్ యువసేనతో పటాన్ చెరులో సేవలందిస్తున్నారు. తన సామాజికవర్గం ఓట్లతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంపన్న వర్గాల ఓట్లతో అత్యధిక మెజార్టీతో నీలం మధు గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Hospital

read also : పొంగులేటికి కాంగ్రెస్ అధిష్టానం జన్మదిన కానుక..

పటాన్‌చెరు నేత నీలం మధు ముదిరాజ్‌ కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంటనే మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హస్తం గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు. ఆయనతో పాటు మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మోత్కుపల్లి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఆ పార్టీని వీడారు. మోత్కుపల్లిని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. తనకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం వచ్చినట్లు ఆయన కొన్నిరోజుల క్రితమే చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మనుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్ గురువారం రాత్రి మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.

అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి చేరిక తమ పార్టీకి ఎంతో బలాన్నిస్తుందని, తెలంగాణ ప్రజలు భారాస అవినీతి పాలనను తిరస్కరిస్తున్నారంటూ కాంగ్రెస్ ట్విట్టర్ లో పేర్కొంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.