Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు భట్టికి ఆహ్వానం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 19

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు..

తెలంగాణ ( telangana ) రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( mallu bhatti vikramarka ) ను మంగళవారం ఆయన ఛాంబర్ లో ఎన్ఆర్ఐ ( nri ) ప్రతినిధుల బృందం కలిసింది. మే 24 నుంచి 26 వరకు అమెరికా ( america ) లో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాలని ఆహ్వానించింది. అలాగే ఈ నెల 23న రవీంద్రభారతిలో జరిగే సేవ డేస్ కార్యక్రమానికి ఆహ్వానం అందించింది.

read also : చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత..

Hospital

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 10 నుంచి ఈనెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఎన్ ఆర్ఐలు డిప్యూటీ సీఎంకు వివరించారు. వరంగల్ లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించగా 16,000 మంది హాజరయ్యారని ఇందులో 1500 మంది నిరుద్యోగులను ఎంపిక చేశామని వారు భట్టికి తెలియజేశారు. 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ లో నిర్వహించే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

read also : indigo : ఇండిగో విమానయాన సంస్థ అరుదైన ఘనత ..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను కలిసిన వారిలో ఆ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి, సురేష్ రెడ్డి, గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్, మనోహర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.