Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ బడ్జెట్ 2,75,891 కోట్లు .. ఆరు గ్యారెంటీలు, విద్యకు ప్రాధాన్యం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 10

తెలంగాణ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు. రాష్ట్ర అసెంబ్లీలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను శనివారం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ( mallu bhatti vikramarka ) ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12 తర్వాత పద్దును సభ ముందు ఉంచారు. పార్లమెంట్ (parliament ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్లో ఉన్నప్పటికి ఏడాది మొత్తానికి అంచనాలను కాంగ్రెస్ ( congress ) సర్కార్ ప్రకటించింది. మొదట రాష్ట్ర బడ్జెట్ కు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభలో మంత్రి భట్టి విక్రమార్క 2024-2025 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

read also : ఆరు గ్యారెంటీలకు రూ.53వేల 196కోట్లు.. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు పెద్దపీట..

Hospital

రూ.2,75,891 లక్షల కోట్ల ప్రతిపాదనలతో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవిన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూల ధన వ్యయం రూ.29,669 కోట్లుగా బడ్జెట్ లో పొందుపరిచారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించకున్నారని.. గుణాత్మక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఎలాంటి త్యాగాలకైనా సర్కార్ సిద్ధంగా ఉంటుందని… ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

read also : పీవీకి భారతరత్న.. చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు అత్యున్నత పౌర పురస్కారం ..

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి భట్టి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించామన్నారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మారణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆరు గ్యారెంటీలు, ఎస్సీ సంక్షేమం, విద్యకు రేవంత్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.