Read News in Telugu Language
adsdaksha

ఆగమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ..

దక్ష న్యూస్, పాల్వంచ : ఏప్రిల్ 29

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి అప్పగించారని, ఆగమైన ఆర్థిక వ్యవస్థను ప్రజా సంక్షేమం కోసం మా ప్రభుత్వం గాడిన పెడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( mallu bhatti vikramarka ) అన్నారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి (ramasahayam raghuram reddy ) విజయాన్ని కాంక్షిస్తూ..పాల్వంచ లో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ), స్థానిక సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( kunamneni sambashivarao ) తో కలిసి అయ్యప్పస్వామి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు.

read also : ఏపీ తరహాలో తెలంగాణలోను వాలంటీర్ వ్యవస్థ.. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఉండేలా ప్రభుత్వ చర్యలు : తీన్మార్ మల్లన్న..

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రూ.7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థికంగా కే సీ ఆర్ దెబ్బ తీశారని అన్నారు. అయినా.. లోటు ను సరిచేస్తూ.. ప్రజల కోసం ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు, ప్రాజెక్టులు ఆరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవే అని అన్నారు. రఘురాం రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తారని, గొప్ప విజయాన్ని అందించాలని కోరారు.

Hospital

read also : రాహుల్ గాంధీతోనే సుపరిపాలన సాధ్యం : సత్తుపల్లి నియోజకవర్గ సమావేశంలో మంత్రి పొంగులేటి ..

రఘు రాం రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించండి : పొంగులేటి

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజా సేవ చేసేందుకు పోటీ చేస్తున్న రఘు రాం రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కేసీఆర్ మాయమాటలు, కల్లబొల్లి కబుర్లు ఎవరూ నమ్మొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.