Read News in Telugu Language
adsdaksha

డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో విషాదం .. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూత..

దక్ష న్యూస్, ఖమ్మం : ఫిబ్రవరి 13

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి మంగళవారం తెల్లవారుజామున 6.50నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

Hospital

read also : డిప్యూటీ సీఎంల నియామకం విరుద్ధం కాదు .. వేతనాలు ఇతర అలవెన్సులు ఉంటాయని సుప్రీం క్లారిటీ ..

వెంకటేశ్వర్లు అంత్యక్రియలు సాయంత్రం వైరాలో జరిగాయి. సోదరుడి మరణవార్త తెలియగానే భట్టి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వైరాకు బయలుదేరారు. హోమియో ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం వైరాలోని ఆయన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అయితే గత మూడు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.