Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మువ్వా విజయ్ బాబు ..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 9

తెలంగాణ  ( telangana ) కాంగ్రెస్ ( congress) పార్టీ కీలక మేనిఫెస్టో కమిటీ మెంబర్ ( manifesto comittee member ) గా, సత్తుపల్లి నియోజకవర్గం లంకపల్లి కి చెందిన మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు ( muvva vijay babu ) ను ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం శనివారం రాత్రి నియమించింది. డిసిసిబి బ్యాంకు వార్షిక ఆదాయాన్ని వెయ్యి కోట్ల నుండి 2000 కోట్ల వరకు పెంచిన మువ్వా విజయబాబును కీలక పదవి వరించడం పట్ల సత్తుపల్లి ( sattupalli )  కాంగ్రెస్ శ్రేణులు శనివారం సాయంత్రం హర్షం వ్యక్తం చేశారు.

read also : ప్రవాసుల సంఘర్షణలకు, అస్త్తిత్వవేదనకు అద్దం పట్టిన నిశాంత్‌ ఇంజమ్‌..

టీపీసీసీ ( tpcc) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ( koturi manavatha roy ) నేతృత్వంలో సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు ఖమ్మం లోని మువ్వా విజయబాబు ఇంటికి వెళ్లి ఘన సన్మానం చేశారు. లంకపల్లి నుంచి కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయికి ఎదిగిన మువ్వా విజయ్ బాబుకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా మానవతారాయ్ ఆకాంక్షించారు.

Hospital

read also :కాళోజీ అవార్డు అందుకున్న కవి జయరాజ్..

విజయ్ బాబుకు ఈ పదవి దక్కటం కోసం కృషిచేసిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నాయకులు మల్లు బట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ సహ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి లకు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

read also : google : గోదాట్లోకి తీసికెళ్లిన గూగుల్.. కాపాడిన స్థానికులు..

కార్యక్రమంలో నాయకులు రావి నాగేశ్వరావు, బుక్కా కృష్ణవేణి, ఫజల్ రెహమాన్ బాబా,కర్నాటి వెంకటరెడ్డి, కొమ్మేపల్లి బాజీ,జానీ పాషా, భూక్య రవీంద్ర, వెల్లంపల్లి ఏడుకొండలు, పాకాల గూడెం బడే సాహెబ్, ఇడుపులపాటి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.