Read News in Telugu Language
adsdaksha

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ చర్చ.. అయినా తేలని పొత్తు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 21

రెండో లిస్టులో అన్నిస్థానాలకు అభ్యర్థులు..

ఎంపికపై మరో సారి సమావేశం..

– టీకాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే..

Hospital

తెలంగాణ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ( congress ) రెండో విడత అభ్యర్థుల ఎంపికకు శనివారం ఢిల్లీ ( delhi ) లో కాంగ్రెస్ నేతల సమావేశం సుదీర్ఘంగా సాగింది. దాదాపు 6 గంటల పాటు సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగిసిందని, కానీ అభ్యర్థుల ఎంపికపై మరో సమావేశం జరిగే అవకాశం ఉందని తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే ( manikrao thakre ) తెలిపారు. రెండో జాబితాలో తెలంగాణలో మిగిలిన అన్నిస్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పారు.

read also : తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు మార్గదర్శకాలను పాటించాలి..

సదరు జాబితాను కాంగ్రెస్ సీఈసీకి పంపిస్తామని, స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాతే జాబితా రిలీజ్ అవుతుందని థాక్రే తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా పొత్తులు తేలలేదని వివరించారు. బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని, ఏ వర్గానికి ఎన్ని సీట్లైనా ఇవ్వడానికి వారికి అసలు అభ్యర్థులు ఉంటే కదా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అన్నివర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. దాంతో ఆదివారం విడుదల కానున్న రెండో విడత ఎంపిక లిస్ట్ కోసం ఆశావహులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.