Read News in Telugu Language
adsdaksha

సిసోడియాకు బెయిల్ .. ఆప్ సీనియర్ నేతకు స్వల్ప ఊరట..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : ఫిబ్రవరి 12

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఏడాదిగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ( manish sisodia ) కు బెయిల్ వచ్చింది. సోమవారం ఢిల్లీ కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వడంతో స్వల్ప ఊరట లభించినట్టైంది. మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు మూడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. పెండ్లీ కోసం లక్నో వెళ్లాల్సి ఉండగా ఈ నెల 13 నుంచి 15 వరకు బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ పిటిషన్‌పై వ్యతిరేకంగా వాదనలు వినిపించినా కోర్టు బెయిల్‌ ఇచ్చింది.

Hospital

read also : 370 సీట్లు పక్కా.. బీజేపి యాట్రిక్ కొడుతుంది : మోడీ

అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సీబీఐ, ఈడీ ఆయనను విచారిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కస్టడీపై తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతోన్న తన భార్యను వారానికి ఒకసారి పరామర్శించేందుకు కొద్దిరోజుల క్రితం ఢిల్లీ కోర్టు సిసోదియాకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన భార్య ఆటోఇమ్యూన్ డిజార్డర్, మల్టిపుల్ స్ల్కెరోసిస్ అనే అరుదైన సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో క్రమంగా శరీరంపై నియంత్రణ కోల్పోతుంది. మనీష్‌ సిసోడియా అరెస్టు తర్వాత సీమా సిసోడియా ఇంట్లో ఒంటరిగా ఉండడం, ఒత్తిడి కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది.

Leave A Reply

Your email address will not be published.