Read News in Telugu Language
adsdaksha

హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా .. కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 12

హర్యానాలో ఐదేళ్లుగా జన్ నాయక్ జనతా పార్టీ ( jjp )తో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న బీజేపీ ( bjp ) ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ( manohar laal khattar ) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో హరియాణా ( hariyana ) కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనీ ( nayab singh shaini ) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌ ( raj bhavan ) లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైనీతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు బన్వరీ లాల్, జై ప్రకాశ్ దలాల్, స్వతంత్ర శాసనసభ్యుడు రంజిత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.

read also : ఆధార్ అప్డేట్‌కు గడువు పెంపు .. మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు వెల్లడి ..

Hospital

శాసనసభాపక్ష సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమించిన మాజీ హోంమంత్రి అనిల్ విజ్ చండీగఢ్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. ఇదిలావుంటే.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-జేజేపీ పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై మొదలైన ప్రతిష్టంభన ప్రభుత్వం కుప్పకూలే వరకూ వచ్చింది. రాష్ట్రంలోని 10 ఎంపీ సీట్లలో రెండింటిని తమకు కేటాయించాల్సిందేనని జేజేపీ చేసిన డిమాండ్‌ను బీజేపీ అంగీకరించలేదు. దీంతో ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి.

read also : ముగిసిన మంత్రి వర్గ భేటీ.. 4లక్షల 50వేల ఇండ్ల కు 22,500 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం..

చివరకు లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీజేపీ అధిష్టానం తమ ముఖ్యమంత్రి ఖట్టర్‌తో రాజీనామా చేయించింది. అయితే ప్రస్తుతం 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 30, జెజెపికి 10, ఐఎన్‌ఎల్‌డి , హర్యానా లోఖిత్ పార్టీకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. వీరు కాకుండా 7 మంది స్వతంత్రులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా బీజేపీకి ఉన్న 41 మందికి తోడు స్వతంత్రుల్ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Leave A Reply

Your email address will not be published.