Read News in Telugu Language
adsdaksha

భవిష్యత్ తరాలకు సాహిత్య మాధుర్యాన్ని అందజేయాలి..

-అధికార భాషాసంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి ..

భవిష్యత్తు తరాలకు తెలుగు సాహిత్య‌ మాధుర్యాన్ని అందజేసేందుకు రచయితలు కృషి ‌చేయాలని తెలంగాణ రాష్ట్ర అధికార భాషాసంఘం ( adhikara bhasha sangam ) అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి  ( mantri sridevi ) అన్నారు. దర్పణం సాహిత్య‌ వేదిక అధ్యక్షులు డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు అధ్యక్షతన ఆదివారం రవీంద్రభారతి ( raveendra bharathi ) లో జరిగిన పాలడుగు సరోజినీదేవి గ్రంథాల పరిచయ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజాన్ని‌ చైతన్యవంతం‌ చేసేందుకు కళలు ఉపకరిస్తాయని ఆమె అన్నారు.

ప్రముఖ జానపద కళాకారుడు పాలడుగు నాగయ్య బుర్రకథలతో సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చారని మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని సమాజానికి అందించిన ఘనత పాలడుగు నాగయ్యదని ఆమె అభిప్రాయపడ్డారు. పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యాన్ని వెలువరించిన ఆయన కుమార్తె పాలడుగు సరోజినీదేవి తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. కవిత్వం ద్వారా కూడా సరోజినీదేవి సమాజాన్ని‌ జాగృతం చేస్తున్నారని ప్రశంసించారు.

read also : రెడ్డోరు.. చౌదరి గారు కలిసిపోయారహో..

దర్పణం సాహిత్య వేదిక నేటి కవులకు మార్గదర్శకంగా నిలుస్తోందని మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షుడు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ, పాతతరం కృషి కొత్త తరానికి తెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. జానపద కళలు వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహనకు ఎంతగానో ఉపయోగపదతాయని ఆయన పేర్కొన్నారు.

Hospital

జానపద జీవితాన్ని కళారూపంలోకి తెచ్చిన గొప్ప కళాకారుడు పాలడుగు నాగయ్య అని ‘పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం’ గ్రంథ పరిచయం చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు, ప్రముఖ కవి డా.నాళేశ్వరం శంకరం అన్నారు. పాలడుగు నాగయ్య రచనల్లో జాతీయతావాదం స్పష్టంగా వెల్లడవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అభివ్యక్తి రచనలకు కీలకమైందని ‘సరోజినీదేవి కుసుమాలు’ గ్రంథ పరిచయం‌ చేసిన తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య గౌరీశంకర్ అన్నారు. పాలడుగు సరోజినీదేవి కవిత్వం గుండెకు హత్తుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

read also : గృహలక్ష్మి దరఖాస్తుల విచారణ ముమ్మరం..

బుర్రకథలతో పాటు వివిధ జానపద కళల్లో పాలడుగు నాగయ్య కృషి చేశారని గ్రంథకర్త పాలడుగు సరోజినీదేవి చెప్పారు. దర్శకత్వం, నటన, రచన, మొదలైన విభిన్న రంగాల్లో నాగయ్య ప్రతిభ కనిపిస్తుందని ఆమె అన్నారు. ఇటీవల మృతి చెందిన దర్పణం సాహిత్య‌వేదిక సభ్యురాలు ఆచార్య సువర్ణ అలివేలుకు సమావేశం నివాళి అర్పించింది. ఆచార్య సువర్ణ అలివేలు పేరు మీదుగా ప్రతి ఏటా పురస్కారం అందజేస్తామని ఆమె కుమార్తె నాగస్వప్న ఈ సందర్భంగా ప్రకటించారు.

ఆకాశవాణి, దూరదర్శన్ సంస్థల పూర్వ అదనపు డైరెక్టర్ జనరల్ డా.రేవూరి అనంత పద్మనాభరావు, పాఠశాల విద్యాశాఖ పూర్వ అదనపు‌ సంచాలకులు పసుల లక్ష్మారెడ్డి, వేదిక ప్రధాన కార్యదర్శి డా.చీదెళ్ల సీతాలక్ష్మి, కవులు రామకృష్ణ చంద్రమోళి, జాలిగామ నరసింహారావు, నక్క హరికృష్ణ, సత్యమూర్తి, నాగస్వప్న, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్పణం సాహిత్య వేదిక 40 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించింది.

Leave A Reply

Your email address will not be published.