Read News in Telugu Language
adsdaksha

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ తిరుపతి మన్యంకొండ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఆగస్ట్ 25

విదేశాల కేబుల్ కార్ కంటే మెరుగ్గా రోప్ వే..

స్కైవాక్ ద్వారా భక్తులకు నేరుగా దైవదర్శనం..

ల్యాండ్ స్కేపింగ్, వెయిటింగ్ ఏరియా, రెస్టారెంట్, పార్కింగ్ సదుపాయాలు..

పేదల కొంగుబంగారం తెలంగాణ తిరుపతి అయిన మన్యంకొండ (manyam konda ) దేవాలయాన్ని యాదాద్రి ( yadadri ), వేములవాడ (vemulavada ) తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ (v.srinivas gaud ) అన్నారు. శుక్రవారం మంత్రుల నివాస సముదాయంలో మన్యం కొండ తుది డిజైన్లను కన్సల్టెంట్లు, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన్యం కొండను ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు.

read also : greece : గ్రీస్ లో నలభై ఏళ్ళ తర్వాత భారత ప్రధాని పర్యటన..

Hospital

మన్యంకొండ దేవాలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్‌ వే ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని విదేశాల్లో ఉన్న కేబుల్ కార్ ( cable car ) కంటే మన రోప్ వే ( rope way) మరింత అద్భుతంగా ఉండనుందని మంత్రి వివరించారు. మన్యంకొండ రోప్ వే కు అనుసంధానంగా కొండమీద ఏర్పాటు చేయనున్న ల్యాండింగ్, ల్యాండ్ స్కేపింగ్, స్కై వాక్, అన్నదాన సత్రం, లడ్డు కౌంటర్, కోనేరు తుది డిజైన్లను మంత్రి ఆమోదించారు. మన్యంకొండ వద్ద చేపడుతున్న రోప్ వే ను స్విట్జర్లాండ్ ( switzerland ), దక్షిణ కొరియా ( dakshina korea ) లో ఉన్న రోప్ వే ల కంటే అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలిపారు. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించడమే లక్ష్యంగా మన్యంకొండ రోప్ వే నిర్మాణం ఉండనుందన్నారు.

కేబుల్ కార్ దిగి స్కై వాక్ ( sky walk ) ద్వారా నేరుగా గుడిలోకి…కొండపైన కేబుల్ కార్ ల్యాండింగ్ అయిన తర్వాత భక్తులు నేరుగా దైవదర్శనానికి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా స్కై వే ( sky way ) నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. అధునాతన అన్నదాన సత్రం, లడ్డు కౌంటర్, కోనేరు నిర్మాణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నామని మంత్రి తెలిపారు. కొండపైన దిగువన ల్యాండ్ స్కేపింగ్ అద్భుతంగా ఉండనున్నాయన్నారు. రోప్ వే స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియా, రెస్టారెంట్, ల్యాండ్ స్కేపింగ్, విశాలమైన పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తామన్నారు.

read also : చందమామ పై మూన్ వాక్.. ప్రజ్ఞాన్ రోవర్ చిత్రాలు విడుదల..

రోప్ వే స్టేషన్ వద్ద ఆధునిక హంగులు…
కొండ దిగువన అలివేలు మంగ దేవాలయం, మెయిన్‌ రోడ్డుకు కుడి వైపు నుంచి కొండపైకి సుమారు కిలోమీటరు మేర రోప్‌ వే నిర్మించనున్నందున ఈ రోప్ వే వల్ల పర్యాటకులు, భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా ఆధునిక హంగులతో సకల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. కొండ దిగువన పర్యాటకుల సౌకర్యం కోసం ఇప్పటికే పెద్ద హరిత పర్యాటక హోటల్ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎంత ఖర్చయినప్పటికీ పేదల తిరుపతి మన్యంకొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సంస్కృతీ సంప్రదాయాలు, ఎకో టూరిజం కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందన్నారు. సీఎం కేసీఆర్‌ పర్యాటక అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని ఫలితంగానే అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని పేర్కొన్నారు.

 

సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, పర్యాటకశాఖ ఓఎస్డి సత్యనారాయణ, టూరిజం కన్సల్టెంట్ కల్పేష్ పటేల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.