Read News in Telugu Language
adsdaksha

కులనిర్మూలన సిద్ధాంత వైతాళికుడు మారోజు వీరన్న : కాకి భాస్కర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పొడకండి రాంబాబు..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 15

కులనిర్మూలన సిద్ధాంత వైతాళికుడు మారోజు వీరన్న అని మాజీ పి.డి.ఎస్.యూ నాయకులు కాకి భాస్కర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పొడకండి రాంబాబులు అన్నారు. ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీలో లింగనబోయిన లక్ష్మణ్ అధ్యక్షతన పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక కార్యాలయంలో బుధవారం మే 16 మారోజు వీరన్న వర్ధంతి సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పీ.డి.ఎస్.యు మాజీ నాయకులు కాకి భాస్కర్ హాజరై మాట్లాడుతూ…

Read also: ponguleti : మాట్లాడుకుందాం రండి…! నాలుగురోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ..

మారోజు వీరన్న ఓ సిద్ధాంతకర్త అని అతను ఈ దేశాన్ని విముక్తి చేసే సిద్ధాంతాన్ని రాశాడని అన్నారు. ఆనాడు లెనిన్ రష్యాలో ఏం చేయాలని రాస్తే, మారోజు ఇండియాలో ఏం చేయాలని ఓ పుస్తకాన్ని రాశాడన్నారు. సాంప్రదాయ కమ్యూనిస్టులను చీల్చి చెండాడారన్నారు. ఈ దేశంలో కులం ఉందని ఇది కులవర్గ సమాజమని, మీరు మాత్రం వర్గ సమాజం అనడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని, మీరంతా అగ్రకులాలే, పార్టీలో నిర్ణయాలు చేసే అధికారంలో ఉండబట్టే మీరు పూలే, అంబేద్కర్ లను విస్మరించారన్నారు.

Read also: బహు ముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆయేషా సుల్తానా ..

Hospital

అందుకే ఈ దేశంలో విప్లవం విజయవంతం కావడం లేదని ఆ పార్టీలను ప్రజల సమక్షంలో ఎండగట్టాడన్నారు. అంత మాత్రమే కాదు అణగారిన కులాలను కూడగట్టి సంఘాలను నిర్మించి ఈ రాజ్యంపై తిరుగుబాటు చేయించిన కులనిర్మూలన సిద్ధాంత వైతాళికుడు కామ్రేడ్ మారోజు వీరన్న అని కొనియాడారు. దళిత బహుజన పితామహుడని అంతటి మహనీయుని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.

బహుజన కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోడకండి రాంబాబు మాట్లాడుతూ… 1996 ప్రాంతంలోనే సామాజిక తెలంగాణ కోసం గళం విప్పిన వాడు మారోజు వీరన్న అన్నారు. చిన్న రాష్ట్రాల్లోనే అణగారిన కులాలకు అభివృద్ధి జరుగుతుందని చెప్పిన అంబేద్కర్ మాటలకు కొనసాగింపుగా సామాజిక తెలంగాణ పేరుతో 3000 సభలు నిర్వహించి సూర్యాపేటలో ఆగస్టు 10, 1997న భారీ బహిరంగసభను నిర్వహించి తెలంగాణ ప్రజల్లో ఉన్న రాష్ట్ర కాంక్షను ఈ సమాజానికి చూపించాడన్నారు.

Read also: వేసవి సెలవుల్లో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న తాజ్ మహల్ ఎగ్జిబిషన్..

ఆ ప్రభంజనం చూసి తట్టుకోలేక ఆంధ్ర కమ్మ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మారోజును ఇలానే వదిలేస్తే పెద్ద నష్టమే జరుగుతుందని బావించి అత్యంత కిరాతకంగా మారోజుని హత్య చేయడం జరిగినదని ఆరోపించారు. ఆ దుర్మార్గులు మారోజుని భౌతికంగా దూరం చేశారేమో కానీ దళిత బహుజన జాతుల్లో ఎప్పటికి బ్రతికే ఉంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల గుతపదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ధారా వెంకయ్య, సేవాలాల్ నాయకులు బానోత్ కిషన్ నాయక్, కంటెస్టింగ్ పార్లమెంట్ అభ్యర్థి ఆంతోని సురేష్ డక్కలి, కొంగర శ్రీను, కుమ్మరి ప్రభాకర్ తదిరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.