Read News in Telugu Language
adsdaksha

మట్టా దయానంద్ కు హైకోర్టులో చుక్కెదురు..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 25

రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆశ్రయించేందుకు వారం గడువు..

సత్తుపల్లి కాంగ్రెస్ ఆశావహ అభ్యర్ధి మట్టాదయానంద్ ( matta dayanand ) ఎస్పీ కుల దృవీకరణ ను గత నెలలో ఖమ్మం ( khammam ) జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) రద్దు చేసిన విషయం విదితమే. దాన్ని సవాలు చేస్తూ దయానంద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా సోమవారం దయానంద్ కేసు విచారణకు రాగా వాదోపవాదాలు విన్న హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి, కలెక్టర్ కుల దృవీకరణ పత్రం రద్దు చేసిన తర్వాత నేరుగా హైకోర్టును ఆశ్రయించరాదని తెలిపారు. ముందుగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ని ఆశ్రయించాలని సూచించారు. దయానంద్ సరైన పద్దతిలో రానందున ఎటువంటి తీర్పు ప్రకటించలేదు. కాగా వారం రోజుల్లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ వద్ద అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హైకోర్టు తీర్పు ద్వారా మట్టా దయానందుకు కులదృవీకరణ పత్ర రద్దు విషయంలో ఎటువంటి ఉపశమనము లభించలేదు.

ముంచుకొస్తున్న ఎన్నికలు.. అయోమయంలో రాజకీయ భవితవ్యం..

సత్తుపల్లి కాంగ్రెస్ నేత మట్టాదయానంద్ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఖమ్మంజిల్లా కలెక్టర్ విపీ గౌతమ్ గత నెలలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మట్లా దయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పత్రం పొందటాన్ని సవాల్ చేస్తూ ములుగు జిల్లా (ఉమ్మడి ఖమ్మం) వెంకటాపురం గ్రామానికి చెందిన కొడారి వినాయక రావు ( kodari vinayakarao ) అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటిపడ్డారని, ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని ఫిర్యాదు వినాయక రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Hospital

read also : జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ఉద్దేశపూర్వకంగానే కాలయాపన ..

వినాయకరావు ఫిర్యాదుపై , వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించి నివేదికలు సమర్పించారు. వినాయకరావు ఫిర్యాదు పై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆధారాలు సమర్పించవలసిందిగా జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ (District LeveL Scrutiny committee)(DLSC). ఆదేశించింది. తగిన ఆధారాలు సమర్పించక పోవడంతో మాట్లా దయానంద్ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక సమర్పించారు. దాంతో దయానంద్ ఎస్సీ కుల దృవీకరణను ఖమ్మం జిల్లా కలెక్టర్ రద్దు చేశారు.

read also : తెలంగాణ ప్రజలను స్కీంలు, స్కాంలతో దోచుకుంటుంన్నారు.. బండి సంజయ్..

దాంతో హైకోర్టును ఆశ్రయించిన దయానంద్ కు అక్కడ చుక్కెదురైంది. జిల్లా కలెక్టర్ కుల దృవీకరణ పత్రం రద్దు చేసిన తర్వాత నేరుగా హైకోర్టును ఆశ్రయించరాదని హైకోర్టు జడ్జి తెలిపారు. ముందుగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ని ఆశ్రయించాలని సూచించారు. అందుకు వారం రోజలు గడువు ఇచ్చారు. దాంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తున్న సమయంలో దయానంద్ కులదృవీకరణ ఆయన రాజకీయ భవితవ్యంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

Leave A Reply

Your email address will not be published.