Read News in Telugu Language
adsdaksha

మట్టా దయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పత్రం రద్దు ..

దక్ష న్యూస్, ఖమ్మం: ఆగస్ట్ 22

సత్తుపల్లి కాంగ్రెస్ నేత మట్టాదయానంద్ ( matta dayanand ) ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఖమ్మం ( khammam ) జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్ ( collector v.p. gautham ) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మట్లా దయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పత్రం పొందటాన్ని సవాల్ చేస్తూ ములుగు జిల్లా (ఉమ్మడి ఖమ్మం)
వెంకటాపురం గ్రామానికి చెందిన కొడారి వినాయక రావు ( kodari vinayakarao ) అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటిపడ్డారని, ఎస్సీలకు దక్కాల్సిన
రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని ఫిర్యాదు వినాయక రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

read also : హైదరాబాద్ నగరానికి ధీటుగా ఖమ్మం అభివృద్ధి..

Hospital

వినాయకరావు ఫిర్యాదుపై , వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించి
నివేదికలు సమర్పించారు. వినాయకరావు ఫిర్యాదు పై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆధారాలు సమర్పించవలసిందిగా జిల్లా స్థాయి
స్కృటినీ కమిటీ (District LeveL Scrutiny committee)(DLSC). ఆదేశించింది. తగిన ఆధారాలు సమర్పించక పోవడంతో మాట్లా దయానంద్ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక సమర్పించారు.

read also : విద్య వ్యాప్తికి కృషి చేసిన ఆర్.బి.వి.ఆర్.ఆర్ సేవలు ఎల్లవేళలా చిరస్మరణీయం..

కులాంతర వివాహాలలో పిల్లలు ఏ కులాన్ని పొందుతారనే అంశంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకు లోబడి మట్టా దయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాడని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన ఆదేశాలల్లో పేర్కొన్నారు. కుల ధృవీకరణ పత్రాల వివాదంలో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను తమ ఆదేశాల్లో ఉటంకించి, మాట్టాదయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టు, ఆయా జిల్లా శాఖ అధికారులను సమాచారం పంపించారు.

Leave A Reply

Your email address will not be published.