Read News in Telugu Language
adsdaksha

శ్రీరామ నవమి పందిళ్ళను సందర్శించిన సత్తుపల్లి ఎమ్మెల్యే ..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఏప్రిల్ 17

సాయి వెంకట్ మొగుదుంపురం, నెట్ వర్క్ ఇంచార్జ్.

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సత్తుపల్లి ( sattupalli ) నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ( matta ragamayi dayanand ) నియోజకవర్గంలోని పలు రామాలయాలను సందర్శించి భక్తులకు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్ రావి చెట్టు బజార్ రామాలయంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

కల్లూరు రామాలయంలో..

Hospital

శ్రీరామ నవమి సందర్భంగా కల్లూరు మేజర్ పంచాయతీ కప్పలబంధం రోడ్ లోని రామాలయంలో శ్రీరామ నవమి సందర్బంగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎమ్మెల్యే భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం లో కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

అనంతరం కల్లూరులోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్బంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తులతో కలిసి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖాన్ ఖాన్ పేటలో..
కల్లూరు మండలం ఖాన్ ఖాన్ పేట గ్రామం లో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఖాన్ ఖాన్ పేట ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసి శ్రీసీతారాముల ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.

Leave A Reply

Your email address will not be published.