Read News in Telugu Language
adsdaksha

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఏప్రిల్ 11

రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం సత్తుపల్లి పట్టణం-జవహర్ నగర్ లోని ఈద్గా మైదానంలో మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ( Matta ragamayi dayanand ), రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Read also: భద్రాచలానికి రూపాయి ఇవ్వలే… రాముడితో పంచాయితీ లేదు బీజేపీతోనే : మాజీ మంత్రి కేటీఆర్..

రంజాన్ సందర్భంగా ఉదయం ఈద్గాల వద్ద ముస్లిం మత పెద్దలు ఖురాన్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని,పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు.

Hospital

Read also: డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు..

ఈ కార్యక్రమంలో మండల,పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.