Read News in Telugu Language
adsdaksha

జలమండలి వర్షాకాల ప్రణాళిక..జీహెచ్ఎంసీ పరిధిలో డీప్ మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ బిగింపు ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 27

డీప్ మ్యాన్ హోళ్లకు ఎరుపు రంగు వేయాలని..వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి ( md sudharshan reddy ) సూచించారు. ఖైరతాబాద్ ( khairathabad ) లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాల ప్రణాళికను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో.. డైరెక్టర్లు మొదలుకొని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపైన దృష్టి సారించాలని ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా కాకుండా అందులో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సీవరేజి ఓవర్ ఫ్లో ను సీరియస్ గా తీసుకుని ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. వివిధ అంశాలపై వచ్చే ఫిర్యాదుల్ని అరగంటలో పరిష్కరించాలన్నారు. సీవరేజీ ఓవర్ ఫ్లో తో పాటు కలుషిత నీటి సరఫరా వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను.. అరగంటలో పరిష్కరించాలని ఆదేశించారు.

read also : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..

వాటర్ హాట్ స్పాట్లు గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్, సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వివరించారు. వర్షాకాలంలో కలుషిత నీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ యంత్రాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎండీ సూచించారు.

జలమండలి, జీహెచ్ఎంసీ 120 వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఎండీ తెలిపారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను (సిల్ట్) ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. మంచి నీటి పైపు లైను నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు.

read also : మెగాస్టార్ ఔదార్యం.. సీనియర్ జర్నలిస్ట్‌కు ఫ్రీగా ఆపరేషన్ చేయించిన చిరంజీవి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటీజన్లు..

ముంపునకు గురైన మ్యాన్హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎండీ తెలిపారు. రహదారుల మీద ఉన్న మ్యాన్ హోళ్లకి.. ఎరుపు రంగు వేయాలని ఎండీ ఆదేశించారు. డీప్ మ్యాన్ హోళ్ల దగ్గర సీవరేజి సూపర్వైజర్లు ఉండేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బోర్డు సిబ్బంది అంతా.. ఈ సీజన్ లో విమర్శలకు తావు లేకుండా పనిచేయాలని సూచించారు.

సమన్వయంతో పనిచేయాలి:

జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఎండీ సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోళ్ల మూతలను తెరవకూడదని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

Hospital

మ్యాన్ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు:

జీహెచ్ఎంసీ పరిధిలో 5,767 కిలో మీటర్ల సీవరేజ్ నెట్ వర్క్ ఉండగా.. శివారు మున్సిపాలిటీ ల పరిధిలో 4,200 కిలో మీటర్లు ఉంది. జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 6,34,919 మ్యాన్ హోళ్లు ఉండగా, అందులో డీప్ మ్యాన్ హోల్స్ 63,221 ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 26,798, శివారు మున్సిపాలిటీల పరిధిలో 36,423 ఉన్నాయి. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు అన్ని డీప్ మ్యాన్ హోల్స్ కి ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. శివారు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వాటికి గ్రిల్స్ బిగింపు పనులు ఊపందుకున్నాయి.
ఈ సమావేశంలో ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డెరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.

జలమండలి ప్రత్యేక కార్యాచరణ : ఎండీ ఎండీ సుదర్శన్ రెడ్డి..

జలమండలికి తాము సేవలు అందిస్తున్న వినియోగదారులతో పాటు.. పని చేస్తున్న సిబ్బంది భద్రత కూడా ముఖ్యమే. అందుకే వర్షాకాలంలో వారి సేఫ్టీకి తగిన చర్యలు తీసుకుటుంది. ఈ సీజన్ కోసం ప్రత్యేక ప్రణాళికల ద్వారా సేవలు అందిస్తుంది. ఈ మాన్ సూన్ లో జలమండలి తీసుకునే చర్యలు

సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్ (సీఎస్ పీఎస్):
మాన్ సూన్ పనుల పర్యవేక్షణకు జలమండలి 2022లో ప్రత్యేకంగా “సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్ ” ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ సెల్.. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆయన దీనికి చీఫ్ సేఫ్టీ ప్రొటోకాల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. ఇందులో పెట్రోలింగ్ వాహనం, ఒక కానిస్టేబుల్, ఇద్దరు హోం గార్డులతో పాటు కమ్యూనికేషన్ సామగ్రి ఉంటుంది. ఈ సెల్ క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వచ్చే రోజువారీ ఫిర్యాదులపై ఆడిట్, రిపోర్టుల పర్యవేక్షణ, పని ప్రాంతాల్లో భద్రతా చర్యలు పాటించేలా చూస్తుంది.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆర్టీ):

ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. వర్షాకాలంలో కీలకంగా వ్యవహరిస్తుంది. విపత్కర సమయాల్లో ఈ బృందం సహాయక చర్యలు అందిస్తుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతుంది. ఇది జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ తో కలిసి సమన్వయం చేసుకుని పనిచేస్తుంది.

సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ):
ఇది జలమండలికి సంబంధించి ప్రత్యేక భద్రతా బృందం. వివిధ పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తుంది. అన్ని ఓ అండ్ ఎం సైట్లలో తనిఖీలు నిర్వహించి భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకుంటారు. పని జరిగే ప్రదేశాల్లో సూచికలు ఏర్పాటు మొదలు.. జియో ట్యాగింగ్ వరకు పనులు చేస్తారు. డివిజన్ కు ఒక బృందాన్ని కేటాయించారు.

మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్ – డైలి సిచువేషన్ రిపోర్ట్:

జీహెచ్ఎంసీ ద్వారా గుర్తించిన వాట్ లాగింగ్ పాయింట్స్, మ్యాన్ హోల్స్ తదితర అంశాలతో క్షేత్రస్థాయిలో మేనజర్లు ఈ మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. రోజూ వారి పరిధిలో పర్యటించి డైలీ సిచువేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాలి. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గర ఒక వ్యక్తిని నియమించి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సీజీఎం స్థాయిలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. ఎప్పటికప్పుడు ఎంఎంపీ- డీఎస్ఆర్ కు సంబంధించి సమాచారం అందులో పంచుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.