Read News in Telugu Language
adsdaksha

నేటి నుండి విదేశీ మీడియా ప్రతినిధుల బృందం పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న 22 మంది పాత్రికేయులు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 17

వివిధ దేశాల సాంస్కృతిక వైవిధ్యాన్ని అధ్యయనం చేసి పరస్పర అవగాహనతో ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియా , యూరోప్, ఆఫ్రికా , అమెరికా దేశాల మీడియా ప్రతినిధులు భారతదేశంలో పర్యటించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యటన షెడ్యూల్ రూపొందించింది.

మీడియా ఎక్చేంజ్ (media exchange ) లో భాగంగా ఈ నెల 17 ఆదివారం నుండి 20 వ తేదీ వరకు 12 యూరప్ దేశాల కు చెందిన 22 మంది మీడియా ప్రతినిధులు తెలంగాణ లో పర్యటించేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూరోపియన్ మీడియా బృందానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎం.హన్మంతరావు ఆదేశాల మేరకు రాష్ట్ర మీడియా అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు.

read also : గ్రూప్ 1 దరఖాస్తులు 4.03 లక్షలు..సవరణకు మార్చి 23 నుంచి 27 వరకు అవకాశం ..

Hospital

ఈ మీడియా బృందం వెంట న్యూ ఢిల్లీ నుండి విదేశీ వ్యవహారాల మంత్రత్వశాఖ అధికారి చంద్రేశ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. యూరోప్ లోని ఆల్బెనియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, ఈస్తొనియ, ఫిన్లాండ్, లాట్వియా, లిథుయేనియా, పోలాండ్, రొమేనియా, సెర్బియా, స్లోవేకియా దేశాలలోని పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన 22 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు.

read also : ప్రణీత్‌రావుకు 7రోజుల పోలీసు కస్టడీ ..అనుమతినిచ్చిన నాంపల్లి కోర్టు ..

తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం గోల్కొండ కోట, శిల్పారామం లను సందర్శిస్తారు. ఈ నెల 18 న భారత్ బయోటెక్, టి హబ్, టి వర్క్స్, స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ లను, 19 న ISB, రామోజీ ఫిల్మ్ సిటీ లను సందర్శిస్తారు. ఆయా సంస్థల గురించి తెలుసుకుంటారు.

 

Leave A Reply

Your email address will not be published.