Read News in Telugu Language
adsdaksha

ఇక వైద్య రంగానికి హబ్ గా ఖమ్మం.. 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తి..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 14

100 సీట్లతో విద్యా సంవత్సరం ప్రారంభం..

ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ( medical college ) ను మరి కొద్ది సేపట్లో మంత్రులు హరీష్ రావు ( harish raao ), పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) లాంఛనంగా ప్రారంభించనున్నారు. (గురువారం) ఈ సందర్భంగా ఖమ్మం ( khammam ) ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది. పాత కలెక్టరేట్, రోడ్డు భవనాల శాఖ కార్యాలయం కలుపుకొని 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టం ప్రకారం అనుమతి లభించిన దరిమిలా తరగతుల నిర్వహణకు సిద్దంగా ఉంది.

read also : ఇక హైద‌రాబాద్ లో క్వాంట‌మ్ సేవ‌లు ..

Hospital

ఈ విద్యా సంవత్సరం నుండి 100 సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. పాత కలెక్టరేట్ భవనాన్ని రెన్నోవేషన్ చేసి, రూ.8.5 కోట్లతో పరిపాలన, లైబ్రరీ, పరీక్షలు, టీచింగ్ హాళ్లు గా, పాత పౌరసరఫరాల కార్యాలయం, ఇవిఎం గోడౌన్ ను మ్యూజియం, బయో కెమిస్ట్రీ, క్లినికల్ ఫిజియాలజీ, హేమటాలజీ, అంఫిబియా ల్యాబ్ లు, డిసిక్షన్ హాల్, లెక్చర్ హాళ్లు ఏర్పాటు చేశారు. పాత గిరిజనాభివృద్ది అధికారి కార్యాలయంలో బయో కెమిస్ట్రీ, అనాటమి శాఖల అధికారులు, సిబ్బంది కార్యాలయం, పాత రోడ్డు భవనాల శాఖ కార్యాలయాన్ని బాలికల హాస్టళ్లుగా తీర్చిదిద్దారు.

ల్యాబ్ లకు సంబంధించి పరికరాలు, కళాశాలకు సంబంధించి ఫర్నీచర్, కంప్యూటర్ సామాగ్రి అంతా ఏర్పాటు పూర్తయింది. అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ వైద్య కళాశాల కు ప్రభుత్వం ఆరుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసిసియేట్ ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించగా, వారందరూ విధులకు రిపోర్ట్ చేశారు. ఇప్పటికే కళాశాల నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.166కోట్లను మంజూరు చేసింది.

read also : మైండ్ బ్లోయింగ్ ఆప్షన్ లతో వివో T2 ప్రో 5G ఫోన్..

ఖమ్మం ఆసుపత్రిలో ఉన్న అధునాతన పరికరాలు, సౌకర్యాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహబూబాబాద్‌, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు జిల్లాల నుంచి కూడా వైద్యం కోసం రోగులు వస్తుండడంతో ఖమ్మం మెరుగైన వైద్యానికి కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. వైద్య కళాశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖమ్మం వైద్య రంగానికి హబ్ గా నిలువనుంది.

 

Leave A Reply

Your email address will not be published.