Read News in Telugu Language
adsdaksha

వైద్య విద్యలో నవశకానికి నాంది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 15

తెలంగాణ ( telangana ) రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేసి వైద్య విద్యలో సిఎం కేసీఆర్ ( cm kcr ) నవశకానికి నాంది పలికారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఒకేరోజు 9 ప్రభుత్వ నూతన మెడికల్ కళాశాల ( medical colleges ) లలో తరగతులు ప్రారంభించి కెసిఆర్ తన మార్కును చూపించారన్నారు. శుక్రవారం సీఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 మెడికల్ కళాశాలలకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్ధులకు సీఎం శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.

read also : టెట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ..

Hospital

అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాలలలో తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.

read also : ఉదయం నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు..ఎందుకు…?

మెడికల్ కళాశాలల ఏర్పాటుతో జిల్లాలో కలిగే ప్రయోజనాలను, మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉండే హాస్పిటల్లో అందే వైద్య సేవలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. మెడికల్ కళాశాల భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.166 కోట్లు మంజూరు చేసిందని మంత్రి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.