Read News in Telugu Language
adsdaksha

భాజపా, భారాస సఖ్యత వార్తల్లో నిజం లేదు..మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో బండి సంజయ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 6

భాజపా (bjp), భారాస ( brs ) కు మధ్య సఖ్యత కుదిరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ( bandi sanjay ) అన్నారు. అమెరికా ( america ) లో పర్యటిస్తున్న బండి సంజయ్ నార్త్ కరోలినా ( north carolina ) చార్లోటేలోని హిందూ సెంటర్ లో ఓవర్సీస్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ( meet and greet )  ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని
రాబోయే ఎన్నికల్లోనే కాదు మున్ముందు కూడా అలాంటి ఆలోచనే చేయమన్నారు.

Hospital

read also : బిఆర్ఎస్ అహంకారానికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ ..

మజ్లిస్ తో అంటకాగుతున్న బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలా…? ఎంపీగా పోటీ చేయాలా…? అనేది తమ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ అధినాయకత్వం సూచించిన ప్రకారమే తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు రెండో ఆలోచనేం లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.