Read News in Telugu Language
adsdaksha

పాల‌కుర్తి మెగా జాబ్ మేళాకు విశేష స్పంద‌న‌ ..

దక్ష న్యూస్, జనగామ: సెప్టెంబర్ 20

జనగామ‌ ( janagama ) జిల్లా లోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పాలకుర్తి ( palakurthi ) లో మెగా జాబ్ మేళా ( mega job mela)  నిర్వహించినట్లు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ( errabelli dayakar rao ) తెలిపారు. బుధవారం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో డి.ఆర్.డి.ఎ, ( drda ) ఎర్ర‌బెల్లి చారిటబుల్ ట్ర‌స్టుల ( errabelli charitable trust ) సంయుక్త ఆధ్వ‌ర్యంలో పాల‌కుర్తిలోని ఓ ఫంక్ష‌న్ హాలులో నిర్వ‌హించిన మెగా జాబ్ మేళా ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మొత్తం 80 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని, ఈ కంపెనీల ద్వారా సుమారు 14 వేల 205 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. కంపెనీలలో సెలెక్ట్ అయిన వారికి సుమారు రూ. 12 వేల నుండి రూ.40 వేల వరకు జీతభత్యాలు ఉంటాయన్నారు.

అభ్యర్ధులు ఉద్యోగాలలో చేరిన తరువాత పని అనుభవముతో భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మొత్తంలో జీత భత్యాలు సంపాదించుకోవచ్చని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ( egmm ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(drda), ఎర్ర‌బెల్లి చారిటబుల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో జాబ్ మేళా నిర్వహించడం ఎంతో అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్‌, ఐటి, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటిఆర్‌ల కృషితో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు పెరిగాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికే సీఎం కేసిఆర్ రాష్ట్రంలో ల‌క్షా 35వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డం జ‌రిగిందని,

ఇంకా ఆయా శాఖ‌ల్లో ఖాళీగా ఉద్యోగాల‌ను గుర్తించి ఇప్పటికే 90 వేల ఉద్యోగాల భ‌ర్తీకి ప్రభుత్వం శ్రీ‌కారం చుట్టిందని తెలిపారు.

read also : సీమ నీటి కష్టాలు నాకు తెలుసు..

Hospital

రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలే కాదు… ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. కేటిఆర్ కృషితో.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డి పెట్టేందుకు విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకు వ‌స్తున్నారన్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తుందని, దేశంలో ఐటి రంగంలో అభివృద్ది చెందిన బెంగుళూరుకు ధీటుగా మ‌న హైద్రాబాద్ ఎదిగిందన్నారు.

పాలకుర్తి జాబ్ మేళాలో ఇప్ప‌టికే ఇక్క‌డికిక్క‌డే కొంద‌రికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించగా, మిగ‌తా వాళ్ళ‌కి త‌ర్వాత కాల్ లెట‌ర్స్ పంపిస్తారని మంత్రి తెలిపారు. ఇక్కడి యువతకు ఫార్మా, ఐటి, బ్యాంకింగ్, హస్పిటల్ ఇండస్ట్రియల్, సాఫ్ట్ వేర్, మార్కెటింగ్, ఫైనాన్స్ ఇలా అనేక రంగాల్లో అపోలో, ఎంపవర్ మెంట్ సర్వీసెస్, విప్రో, ఆమెజాన్, ప్లిప్ కార్ట్ లాంటి అనేక కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

read also : చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలో ఎన్ఆర్ఐ ల నిరసన..

నియోజ‌క‌వ‌ర్గం నుంచే గాక‌, జిల్లా వ్యాప్తంగా ప‌లు ప్రాంతాలైన పాల‌కుర్తి, దేవ‌రుప్పుల‌, కొడ‌కండ్ల, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండ‌లాల నుంచి జాబ్ మేళాకు అభ్యర్ధులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. దాంతో మంత్రి ఎర్రబెల్లి ఒక్కో కంపెనీ కౌంట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ళి, ఉద్యోగాల ఎంపిక‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. అభ్యర్ధులతో ముచ్చ‌టించి, వారి అర్హ‌త‌లు, అవ‌కాశాల‌పై చ‌ర్చించిన మంత్రి ఉద్యోగార్థుల‌కు, వారి వెంట వ‌చ్చిన వారికి భోజ‌నాలు వండించి, స్వయంగా వ‌డ్డించారు.

జాబ్ మేళాలో పాల్గొన్న ఆయా కంపెనీల‌కు మంత్రి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ శివ‌లింగ‌య్య‌, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, డిఆర్ డిఓ, ఇత‌ర అధికారులు, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావు ఆయా కంపెనీల ప్ర‌తినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.