Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నిజమైన పారదర్శక ప్రజాపాలన..

దక్ష న్యూస్, పినపాక : జనవరి 5

– పొంగులేటి ప్రధాన అనుచరుడు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్..

అక్రమాలకు, బంధుప్రీతికి, పైరవీలకు ఆస్కారం లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) నాయకత్వంలో పక్షపాతం లేకుండా నిజమైన పారదర్శక ప్రభుత్వం ఏర్పడిందని పొంగులేటి ( ponguleti ) ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ( mekala mallibabu yadav ) అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ( congress ) పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీ ల పథకం అమలు జరగటంతో తెలంగాణ ( telangana ) ప్రజలు సంతోషంగా ఉన్నారని, మేకల మల్లిబాబు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

read also : ఖమ్మంలో అట్టహాసంగా ప్రారంభమైన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ..

Hospital

శుక్రవారం పండితాపురంలో ప్రజా పాలన గ్రామసభను ,ఎండిఓ, స్పెషల్ ఆఫీసర్, సర్పంచ్, ఎస్సై,, విద్యుత్తు, హెల్త్, అంగన్ వాడి అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, నెరవేర్చలేకపోయిందని అన్నారు.

బందు ప్రీతితో, పైరవీలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బిఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను, అప్పుల తెలంగాణగా మార్చిందని, ఈ విషయాన్ని కప్పి పెట్టి, తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని, దేశానికి తెలంగాణ మోడల్ అని అబద్ధాలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ప్రజల కోరికలు నెరవేరుతాయని, ప్రజలంతా సమిష్టిగా ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ కట్టబెట్టారని, వంద రోజులలో అమలు చేస్తామన్న గ్యారెంటీల పథకం అమలులో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం నెల రోజుల్లోనే ప్రజాపాలన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

read also : t 20 : టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ..

ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలంతా ఒక జాతర లాగా హాజరవడం, దరఖాస్తులు పెట్టుకోవడం, భారీగా స్పందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అధిక మెజారిటీ సాధించిన కోరం కనకయ్య హయాంలో, గృహ నిర్మాణ శాఖ మాత్యులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో బడుగు బలహీన వర్గాల, గిరిజనులు అధికంగా ఉన్న కామేపల్లి మండలానికి ఎక్కువ నిధులు సమకూర్చి అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈరోజు తోనే కాకుండా ఇది నిరంతర ప్రక్రియ లాగా కొనసాగుతూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఅధికారులు, అనధికారులు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.