Read News in Telugu Language
adsdaksha

మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా మార్పు:

దక్ష న్యూస్, హైదరాబాద్ డిసెంబర్ 21

పెండింగ్ ఫైల్ పై సంతకం చేసిన సీతక్క..

అంగన్‌వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ( mini anganwadi centre )  జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి జనాభా ఉన్న చోట కొత్తగా మినీ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపించారు.

రెవెన్యూ గ్రామాలకు జనావాసాలు దూరంగా ఉండటంతోపాటు జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పదేండ్ల క్రితం ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఇప్పుడు వాటి పరిధిలో జనాభా, కుటుంబాలు పెరగడంతో అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. గతములో 500 మంది జనాభా ఉన్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Read also: హైదరాబాద్‌కు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ..

Hospital

అదే లక్ష్యంతో నేడు అంగన్‌వాడీ కేంద్రాలను గిరిజన, ట్రైబల్‌ ప్రాంతాల్లో 300 మందికి పైగా జనాభా, మున్సిపాలిటీ, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పెండింగ్‌లో ఉన్న ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు.

1975 సంవత్సరంలో ఐసీడీఎస్‌ వ్యవస్థ ఏర్పడింది. వెయ్యి మంది జనాభా ఉన్న చోట ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పౌష్టికాహారం, అయిదేండ్లలోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నది. వెయ్యి జనాభాలోపు ఉన్న చోట మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనాభా పెరుగుదల, నివాస ప్రాంతాల విస్తరణ నేపథ్యంలో ఐసీడీఎస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు మాతా, శిశు సంరక్షణ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, పాత మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌కు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించడముతో ప్రభుత్వం వెంటనే అమలు చేపడుతున్నది.

Read also: స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ ఫోటో లు ఉచిత ప్రయాణానికి అనుమతించబడవు..

మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం టీచర్‌ ఒక్కరే పని చేస్తున్నారు. వీటిని అప్‌గ్రేడ్‌ చేస్తే ప్రభుత్వం 220 మంది అంగన్‌వాడీ టీచర్లతో పాటు హెల్పర్లను కూడా నియమించనుంది. దీంతో కొందరికి ఉపాధి దొరుకుతుంది.

ఇప్పుడు ప్రభుత్వం ప్రధాన కేంద్రాల్లో పనిచేసే టీచర్‌కు నెలకు వేతనం రూ 13,650 ఇస్తోంది. మినీ కేంద్రాల్లోని టీచర్లకు ఇచ్చేది రూ.7,800 మాత్రమే. ఇప్పుడు వాటిని అప్‌గ్రేడ్‌ చేస్తే వీరి వేతనాలు కూడా పెరగనున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.