Read News in Telugu Language
adsdaksha

ఈడీ ఫోన్ పాస్‌వర్డ్‌లను అడుగుతోంది : ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 29

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) పై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈడీ బీజేపీ రాజకీయ ఆయుధంగా ఆ సంస్థ పనిచేస్తోందని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ నుంచి తెలుసుకునేందుకు ఈడీ (ఆప్) ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)ఆరోపించింది.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన అతిషి.. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ గురువారం కోర్టులో ఈడీ వినిపించిన వాదనలను ప్రస్తావించారు. “2021-22లో కొన్ని రోజుల పాటు ‘మద్యం పాలసీ’ అమలులో ఉంది, దీని కింద మనీలాండరింగ్ దర్యాప్తు జరుగుతోంది. ఆ సమయంలో సీఎం ఉపయోగించిన ఫోన్ ఇప్పుడు అందుబాటులో లేదు. ప్రస్తుతం అతడు వాడుతున్న మొబైల్ కొన్ని నెలల క్రితం తీసుకున్నది. కానీ, ఈ కొత్త ఫోన్ పాస్‌వర్డ్‌లను ఈడీ అడుగుతోంది. బీజేపీకి రాజకీయ ఆయుధంగా ఈ డీ పనిచేస్తోందని దీంతో రుజువు అవుతోందన్నారు.

Read also: కేసీఆర్ చేసిన పాపాలు ఆయనకే తగిలాయి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

Hospital

కేసు దర్యాప్తునకు ఈడీ పాస్‌వర్డ్‌లు అడగడం లేదని, అయితే కేజ్రీవాల్ ఫోన్‌లో ఏముందో తెలుసుకోవడం బీజేపీ కుట్ర అని అతిషి అన్నారు. “వారు లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, ప్రతిపక్ష ‘భారత్’ కూటమి నేతలతో చర్చలు, మీడియా-సోషల్ మీడియా ప్రచారం వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అతిషి ఆరోపించారు.

కేజ్రీవాల్ పాస్‌వర్డ్‌లు వెల్లడించలేదు..

ఈ కేసులో కేజ్రీవాల్ కస్టడీని కోర్టు ఏప్రిల్ 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన విచారణలో ఈడీ తన వాదనలు వినిపించింది. దర్యాప్తు సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 21న సీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న 4 డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలను ఆయన వెల్లడించలేదని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.