Read News in Telugu Language
adsdaksha

నెహ్రూ చైనాకు దగ్గరవ్వడంతోనే అమెరికాతో చెడ్డది.. కేంద్రమంత్రి జైశంకర్ సంచలన కామెంట్స్..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 21

భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అమెరికా వ్యతిరేకి అని, 1950లో చైనా తరపున వాదించడం వల్లే అమెరికాతో సంబంధాన్ని చెడగొట్టుకున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ( minister Jai Shankar ) అన్నారు. ఇప్పటికీ కొంతమంది నెహ్రూ విధానాన్ని గొప్పగా భావిస్తున్నారని, అది కేవలం నీటి బుడగ మాత్రమేనని తెలిపారు. నెహ్రూ ఆరాధన నుంచి బయటపడాలని, నెహ్రూ అమెరికా వ్యతిరేకి అవ్వడం వల్లే అందరూ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.

Hospital

Read also: ఉపవాస దీక్షలో కవిత.. గీతాపఠనం, యోగా చేసిన ఎమ్మెల్సీ..

నెహ్రూ చైనా గొప్ప మిత్రుడని అంటుంటారని, నెహ్రూ ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించారు. నెహ్రూ విదేశాంగ విధానం నిందలకు అతీతం కాదని, ఎవరూ అధికారంలోకి వచ్చినా దాన్ని పాటించాలని చెప్పడం తప్పని జైశంకర్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ విదేశీ సంబంధాలను జైశంకర్ ప్రశంసించారు. మోదీ గ్యారంటీ భారతదేశంలో మాదిరిగానే విదేశాల్లో పనిచేస్తుందని, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి ప్రశ్నించినప్పుడు సీఏఏని మన చరిత్ర నిర్దిష్ఠ పరిస్థితిని సరిదిద్దేందుకు, విభజన సమయంలో అటువైపు చిక్కుకున్న వ్యక్తుల పట్ల న్యాయం చేసేందుకు తీసుకొచ్చామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.